2 వేల నోటు.. కలర్ జిరాక్స్ .. యువకుడు అరెస్ట్..

సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు.  మనుషులు మానవ సంబంధాలు వదిలి.. కోట్లకు పడగలు ఎత్తాలని. కోరుకున్నది అనుభవించాలని. తనకు కావాల్సిందే దక్కించుకోవడానికి ఎంతటి అవాంఛనీయమైన పనులు చేయడానికైనా తెగిస్తున్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని మనిషి అవసరం కోసం తయారు చేసుకున్న డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడు. డబ్బు సంపాదించడం అంటే దొడ్డిదారిలో సంపాదించడమే అసలైన వృత్తి కాదు. నిజాయిది తో కూడా మనకు కావాల్సిన డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ చాలా మంది అడ్డదారి పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి నకిలీ నోట్ల తయారీని 2 వేల నోటును కలర్ జిరాక్స్ తీసి తీసి చెలామణి చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకున్నారా.. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి ముందుకు.. 

నకిలీ నోట్ల తయారీని అరికట్టడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అనంతరం సరికొత్త టెక్నాలజీతో 2 వేల నోట్లను, రూ. 500 నోట్లను ముద్రించింది.ఆ టైం లో నకిలీ నోట్లకు ఇక చెక్ పెట్టొచ్చు అని.. వచ్చిన కొత్త నోట్ల మీద పెన్ను గీతాలు, పెన్సిల్ గీతాలు ఉన్న వాడుకలోకి రావు అని చాలా కహానీలు చెప్పారు. కొంత మంది అయితే ఏకంగా కొత్త నోటును దాచిపెట్టిన ఆ నోటు ఎక్కడుందో కనిపెట్టొచ్చు అని పెద్ద పెద్ద కథలు చెప్పారు. ఇంత తతంగం ఉన్న కొత్త నోట్లను నకిలీ సృష్టి కష్టమని అప్పట్లో అధికారులు ప్రకటించింది. అయితే తరచుగా మనం నకిలీ నోట్లను పట్టుకున్నట్లు తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ యువకుడు నోట్లను ముద్రిస్తే.. కష్టమైన పని అనుకున్నట్లు ఉన్నాడు.. ఏకంగా రెండు వేల రూపాయల నోట్లను జిరాక్స్ తీసి చలామణి చేయడానికి చూసాడు.. ఇప్పుడు కటకటాలు పాలయ్యాడు ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రెండు వేల రూపాయల నకిలీ నోట్లను మారుస్తున్న ఉప్పరి రాజు ప్రసాద్ అనే వ్యక్తిని కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఆరు 2 వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతను కలర్ జిరాక్స్ మెషిన్ ఉపయోగించి ఎనిమిది 2 వేల రూపాయల నోట్లు నకలు(జిరాక్స్) తీసినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఉప్పరి రాజు ఇలా నకిలీ నోట్లను చెలామణి చేస్తూ.. పోలీసూలకు పట్టుబడడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో కూడా నకిలీ నోట్లు చెలామణి చేస్తూ ఐదు పోలీసు స్టేషన్లలో పట్టుబడి నిందితుడు జుడిష్యల్ కస్టడీకి వెళ్ళి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.