నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆడియో వైరల్‌

 

నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్  అతడి అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. లేడీ డాన్ అరుణ తనను చంపాలని  స్కెచ్ వేస్తుందని జగదీష్  చెప్పగానే  జగదీష్ పై శ్రీకాంత్ మండిపడ్డారు. అంతా నువ్వే చేశావ్ అంటూ జగదీష్‌ను   శ్రీకాంత్ తిట్ల దండకం అందుకున్నారు. అరుణ  ఎక్కడ.. ఎక్కడ డబ్బులు వసూలు చేసిన విషయాలు జగదీష్  వెల్లడించారు. మీ గ్యాంగ్‌లో  నుంచి  పక్కకు వస్తే చంపేస్తారా అని శ్రీకాంత్‌ను ఆయన ప్రశ్నించారు.  

ఖైదీలు జైలు నుంచి ఫోన్ లు ఏలా  మాట్లాడ గలుగుతున్నారు. రౌడీ షీటర్‌ల  వెనుక ఎవరి హస్తం ఉందని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవిత శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ అలివేలి శ్రీకాంత్...మరో రౌడీ షీటర్ జగదీష్ లో మద్య ఫోన్లో వాగ్వివాదం జరిగింది.నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న ఒక రౌడీ షీటర్‌ శ్రీకాంత్ తో హాస్పిటల్‌లో నిడిగుంట అరుణ  సన్నిహితంగా మెలిగిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu