యమదొంగ ఇంట్లో చోరీకి ప్రయత్నం
posted on Nov 5, 2013 8:57AM

ఈ మధ్య సినీతారల ఇంట్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే మహేష్ బాబు ఇంట్లో దొంగలు చోరీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో కూడా చోరీ చేయడానికి ఒక ఆగంతకుడు ప్రయత్నించినట్లుగా తెలిసింది. అయితే ఎన్టీఆర్ ఇంటి సెక్యురిటీగార్డ్ అప్రమత్తంగా ఉండడంతో ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ దొరకలేకపోయాడని తెలిసింది. చేతిలో ఒక తుపాకీతో, నెంబర్ లేని వాహనంలో ఆ దొంగ వచ్చినట్లుగా సమాచారం. అయితే ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఉన్న లగడపాటి రాజగోపాల్ ఇంటి ముందున్న సీసీ కెమెరాల్లో ఆ దొంగ మొహం గుర్తించినట్లు తెలిసింది. అయితే వెంటనే ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో, విచారణ చేపట్టిన పోలీసులు త్వరలోనే ఆ అగంతకుడిని పట్టుకుంటామన్నారు.