రియాజ్ ఎన్‌కౌంటర్‌పై హెచ్‌ఆర్సీ సుమోటో కేసు
posted on Oct 21, 2025 4:38PM

రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన వరస కథనాల ఆధారంగా చేసుకొని హెచ్ఆర్సి కేసు నమోదు చేసుకుని... ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలంటూ తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు .కానిస్టేబుల్ ఎం. ప్రమోద్ కుమార్ ను అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితుడు రియాజ్ పరారీలో ఉన్నాడు.
అయితే డిజిపి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. రియాజ్‌ను వెంటనే పట్టుకోవాలంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్న నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సారంగాపూర్ లో నిందితుడు రియాజ్ ఓ ద్విచక్ర వాహనదారుడి తో గొడవ పడుతుండగా పోలీసులు అతన్ని పట్టుకొని... నిజామాబాద్ హాస్పి టల్ కి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందు తున్నాడు.
అయితే నిందితుడు రియాజ్ బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా తనకు సెక్యూరిటీగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సర్వీస్ గన్ తీసుకొని పోలీసు లను చంపుతానంటూ బెదిరింపు లకు గురి చేస్తూ అక్కడినుండి పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ పై దాడికి పాల్పడ డంతో ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపామని.... ఈ క్రమంలోనే అతను మరణించాడని పోలీసులు వాదించారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవ నివేదిక సమర్పించాలంటూ హెచ్ఆర్సీ....డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ లేదా మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివ రాలు ఇవ్వాలని సూచించారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 కింద ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది... కాబట్టి ఈ ఘటనపైసుప్రీంకోర్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్కౌంటర్ కు దారి తీసిన పరి స్థితులు మరియు ఎన్కౌంటర్ మరణంపై హెచ్ఆర్సీ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ కాపీ మరియు పోస్టు మార్టం నివేదికతో సహా నవంబర్ 24వ తేదీ వరకు నివేదిక ను సమర్పించా లంటూ డీజీపీకి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.