పార్ల‌మెంట్‌కి సైకిల్‌పై పీసీసీ చీఫ్‌.. ఢిల్లీలో రే..వంతు...

రేవంత్‌రెడ్డి. జెడ్పీటీసీ నుంచి పార్ల‌మెంట్ స‌భ్యుడి వ‌ర‌కూ ఎదిగిన నాయ‌కుడు. సోకాల్డ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కంటే సంథింగ్ డిఫ‌రెంట్‌. అందుకే, అన‌తికాలంలోనే టీపీసీసీ చీఫ్ కాగ‌లిగారు. కాలం క‌లిసొస్తే.. ఆయ‌నే కాబోయే సీఎం అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌గా రాణిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఆయ‌న‌కిక తిరుగులేదు. కేసీఆర్‌పై తిర‌గ‌బ‌డే బ‌ల‌మైన నాయ‌కుడు. కాంగ్రెస్‌లో చేరి త‌క్కువ కాల‌మే అయినా.. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను తీవ్రంగా ప్ర‌శ్నిస్తున్నారు కాబ‌ట్టే ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ఏరికోరి మ‌రీ వ‌రించిందంటారు. ప్ర‌జ‌ల వాయిస్‌ను గ‌ట్టిగా వినిపిస్తూ.. స‌ర్కారును దుయ్య‌బ‌డుతూ.. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ ఆధ్య‌ర్యంలో ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో కాంగ్రెస్‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ పిలుపిస్తే.. దుమ్ముదుమార‌మే. ధ‌ర్నా చేప‌డితే జ‌న‌జాత‌రే. ఉద్య‌మిస్తే.. ఉత్పాత‌మే.

తాజాగా, ఎంపీ రేవంత్‌రెడ్డి ఢిల్లీలో త‌ఢాకా చూపిస్తున్నారు. దేశంలో పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా.. రాహుల్‌గాంధీ నేతృత్వంలో విప‌క్షాలు సైకిల్ ర్యాలీ చేప‌ట్టాయి. రాహుల్ మ‌నిషిగా.. బాస్ ఇచ్చిన టాస్క్‌ను ప‌క్కాగా అమ‌లు చేశారు రేవంత్‌రెడ్డి. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర 834 దాటేసిందంటూ.. అచ్చేదిన్ అంటే ఇదేనా? అంటూ ప్లకార్డు ప్ర‌ద‌ర్శిస్తూ.. సైకిల్ తొక్కుకుంటూ పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి. టీపీసీసీ చీఫ్ సైకిల్ తొక్కుతూ నిర‌స‌న తెలిపిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. త‌మ నాయ‌కుడు సైకిల్ తొక్కే ఫోటోల‌తో రేవంత్ ఫ్యాన్స్, కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు మీద పోస్టులు పెడుతున్నారు. రేవంత్‌రెడ్డి క్రేజ్ మామూలుగా లేదుగా...