పల్లె బాట పట్టిన పట్నం వాసులు.. ఖాళీ అవుతోన్న హైదరాబాద్  

సంక్రాతి పండుగ సందర్భంగా స్కూళ్లకు  వరుస సెలవులు  ప్రకటించడంతో పట్నం వాసులు  పల్లె బాట పట్టారు.  ఇప్పటికే చాలామంది తమ గ్రామాలకు చేరుకున్నప్పటికీ శనివారం  నాడు ఆర్టీసి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో జనాలు కిక్కిరిసి పోయారు.  ఈ నెల11 నుంచి 19 వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. తిరిగి 20 వ తేదీనాడు పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. 
అనేక ప్రభుత్వ, ప్రయివేటు హాస్టళ్ల విద్యార్థులు తమ తమ స్వగ్రామాలకు బయలుదేరారు. ఆంద్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్బంగా తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సీట్లు దొరకకపోవడంతో నిల్చునే తమ స్వగ్రామాలకు బయలు దేరే పరిస్థితి నెలకొంది. శని, ఆది వారాల తర్వాత హైదరాబాద్ దాదాపు ఖాళీ అయినట్టేనని పరిశీలకులు అంటున్నారు. 
 విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలపై కిలో మీటర్ల ట్రాఫిక్ స్థంభించింది. చౌటుప్పల్ మంబలంలో పతంగి టోల్ ప్లాజా ,  కేతేపల్లి మండల పరిధిలోని  కోరపహడ్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ స్థంభించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu