ఎవడ్రా నువ్వు.. యూజ్ లెస్ ఫెలో!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనదైన శైలిలో స్పందించారు. ఈ వీడియో వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెబుతున్నవి సొల్లు కబుర్లు అని ఆమె అభివర్ణించారు. అతడు జిమ్‌లో ఉంటే తీశారన్నారని.. అయినా ఎవరిదండి ఆ జిమ్.. జిమ్‌లో బట్టలు లేకుండా ఉంటారా? అని రేణుకాచౌదరి ప్రశ్నించారు. తనకు తెలిసి బట్టలు లేకుండా చేసే జిమ్ ఇదే అయి ఉంటుందని ఆమె వ్యంగ్యంగా అన్నారు. అలాంటప్పుడు జిమ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ జగన్ ప్రభుత్వాన్ని రేణుకా చౌదరి సూటిగా ప్రశ్నించారు. ఓ యూస్ లెస్ ఫెలో... అలా మాట్లాడారన్నారు. గోరంట్ల ట్రాక్ రికార్డు కూడా అలాంటిదేనని.. అతడి గత చరిత్ర సైతం ఇటువంటిదేనని రేణుకా చౌదరి ఈ సందర్బంగా గుర్తు చేశారు.

గోరంట్ల సీఐగా ఉండి.. పోలీస్ అసోసియేషన్ హెడ్‌గా ఉండిన ఆయనకు చట్టాలు తెలియదా? అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు. గోరంట్ల చేసిందే తప్పు.. క్షమాపణలు చెప్పుకొంటే మర్యాదగా ఉండేదని.. తప్పు ఏదో జరిగిపోయిందని చెప్పుంటే బాగుండేదని ఈ సందర్బంగా రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. కానీ ఇలా కప్పి పుచ్చడం కోసం చేసే ప్రయత్నాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా యాధా రాజా తథా ప్రజా పరిస్థితే అనుకోవాల్సి ఉందన్నారు.

సీఎం జగన్  స్టాండింగ్.. ఆయన స్టేటస్ ఇదని.. అందుకే ఆయన చుట్టు ఇటువంటి వారిని పెట్టుకొన్నారని ఆమె వ్యంగ్యంగా అన్నారు. ఇంత చేసి మళ్లీ కమ్మ కులంపై ఆరోపణలు చేయడం ఏమిటని ఆమె మండిపడ్డారు. అయినా కమ్మ కులం పేరు ఎందుకు ఎత్తుతున్నారని ఆమె గోరంట్లను సూటిగా ప్రశ్నించారు. కమ్మ కులం అంటే ఏమనుకుంటున్నావంటూ గోరంట్లపై రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. నీవు చేతకాని వెధవంటూ గోరంట్లపై  మండిపడ్డారు.  తలా తోక తెలియకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారన్నారు... ఆ క్రమంలో ఖబడ్దార్ అంటూ గోరంట్లకు మాధవ్ కు రేణుకా చౌదరి సవాల్ విసిరారు. చేసింది వెధవ పనులు పైపెచ్చు..కులంపై విరుచుకు పడతావా అంటూ గోరంట్లపై రేణుకా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రేపు ఈ వెధవ మనింటికి వస్తే.. మన ఆడపిల్లలు సేఫా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఏపీలో గోరంట్ల తీరు అలా ఉంటే.. తెలంగాణలో కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు తీరును ఈ సందర్బంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు. దీనిపైన కూడా చర్యలు లేవన్నారు. ఇసుక తకిడి.. పేడ తకిడి అన్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు.. వారి ముర్ఖత్వాలు.. వాళ్లు చేసే వెధవ పనులు.. వాళ్ల పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు మోసారు.. మోస్తున్నారని అన్నారు.

కుక్కకాటుకు చెప్పు దెబ్బ తప్పదని హెచ్చరించారు.  ఎన్నికల అఫిడవిట్‌లో తాను రేపిస్ట్ అంటూ గోరంట్ల చెప్పారని రేణుకా చౌదరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వాటినైనా ఎన్నికల సంఘం చూసుకోవాలన్నారు. అయితే అదీ తనకు తెలియదని... నాకు న్యాయవాది చెప్పాడంటూ గోరంట్ల మాట్లాడరని.. మరి సదరు న్యాయవాదిపై ఏం చర్యలు తీసుకున్నావంటూ గోరంట్లను రేణుకా చౌదరి నిలదీశారు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో గోరంట్లే స్వయంగా డిక్లరేషన్ ఇచ్చారని ఆమె చెప్పారు. కావాలంటే గోరంట్ల మానసిన స్థితిని బాగు చేసేందుకు తమ సామాజిక వర్గం వారంతా డబ్బులు వేసుకుని మరీ చికిత్స చేయిస్తామంటూ   రేణుకా చౌదరి ఆపర్ ఇచ్చారు.