చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా?

 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొదట ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలుపగా.. తాజాగా వాటి సంఖ్య 25కి చేరింది. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

యాక్సిండెట్‌కు రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్ధానికులు అంటున్నారు. రోడ్డు చిన్నగా ఉండటం రద్దీ వల్ల తరచూ ప్రమాదలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితమే 4 వరుసల రహదారి మంజూరు అయిందని తెలిపారు. రోడ్డు విస్తరిస్తే చేట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యూనల్‌కు వెళ్లారన్నారు. దీంతో పనులు  ఆగిపోయాని స్ధానికులు తెలిపారు.

మరోవైపు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిప్పర్‌ రాంగ్‌రూట్‌లో వచ్చి బస్సును ఢీకోట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారని తెలిపారు. మరోవైపు  సహాయ చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం కోసం 9912919545, 9440854433 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu