రూ.11.50 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లోని మాధ‌వా హిల్స్ ఫేజ్‌-2లో పార్కు స్థ‌లాన్ని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లంలో స్థానికంగా ఉన్న వాళ్లు గోడ‌లు క‌ట్టి.. షెడ్డులు వేశారంటూ హైడ్రా ప్ర‌జావాణిలో మాధ‌వాహిల్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులో ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుల‌ను స్థానిక అధికారుల‌తో క‌ల‌సి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి... పార్కు స్థ‌లంగా నిర్ధారించుకున్న హైడ్రా.. వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. ఈ భూమి విలువ దాదాపు రూ.11.50 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.  పార్కును కాపాడిన‌ట్టు పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu