మంత్రి పొన్నం నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు.!
Published on: Fri Aug 28, 2026 12:06PM

రాఖీ పౌర్ణమి వేడుకలు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరిలు రాణి, విమల రాఖీలు కట్టి శుభాకాం క్షలు తెలిపారు. అలాగే మంత్రి సోదరులు అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారు రాఖీలు కట్టారు.
అనంత రం పొన్నం ప్రభాకర్, అశోక్ గౌడ్, రవిచంద్రలు వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లా డుతూ.. రాఖీ పౌర్ణమి సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, అను బంధం, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కుటుంబ బంధా లను మరింత బలోపేతం చేసే ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Rakhi Celebrations in Ponnam residence, Family Members, Sisters, Brothers


