గాంభీరత, స్థితప్రజ్ణత అమిత్ షా భూషణాలు.. రాజనాథ్ సింగ్ పోగడ్తల వర్షం

వడ్డించేవాడు మనవాడైతే భోజనం పంక్తిలో చివర కూర్చున్నా ఏం ఫరవాలేదంటారు. అలాగే మనవాడైతే చాలు లోపాలన్నీ కూడా సుగుణాలుగానే కనిపిస్తాయనివ కూడా అంటారు. ఇప్పుడు అమిత్ షాపై రాజ్ నాథ్ సింగ్ పొడగ్తలు చూస్తే అది నిజమేనని పించక మానదు.

కేంద్రంలో ప్రభుత్వ విజయాలన్నీ అమిత్ షా ఖాతాలో వేసే ప్రయత్నం చేసిన రాజ్ నాథ్ సింగ్ వైఫల్యాల గురించి ఇసుమంతైనా మాట్లాడలేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేసేలా గోవా తదితర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేసిన ఉదంతాలనూ ప్రస్తావించలేదు. అఖరికి శివసేనను నిలువునా చీల్చి మహా రాష్ట్రలో షేండేను గద్దెనక్కించిన సంగతీ మాట్లాడలేదు.. కానీ బీజేపీ విజయాలకు తెరవెనుకనున్న శక్తి అమిత్ షాయే అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అమిత్ షా గాంభీర్యం వెనుక కొండంత మానవత్వం ఉందని చెప్పారు.

అమిత్ సా ప్రసంగాలను గ్రంథస్తం చేసిన శబ్దాంత్ పుస్తకాన్ని రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన అమిత్ షాను అరుదైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు.  పేరు ప్రఖ్యాతల కోసం ఇసుమంతైనా పాకులాడని నిరాడంబరడుగు అమిత్ షా అని చెబుతూ పార్టీ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తారన్నారు. తెర వెనుక ఉంటూనే పార్టీ కోసం నిర్విరామంగా పని చేస్తారని పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన గాంభీర్యం వల్లనే జనం ఆయనను వేరుగా అర్ధం చేసుకుంటారని అన్నారు.

 పలు విషయాలను అవగాహన చేసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు ఆయన టైమ్ మేనేజ్ చేసే తీరు తనను అబ్బుర పరుస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇంతెందుకు రాజ్ నాథ్ సింగ్ మాటల్లో అమిత్ షా జీవితమే ఒక ప్రయోగశాల. ఆరోపణలను ఎదుర్కొని జైల్లో గడిపినా నిర్దోషిగా అమిత్ షా బయటకు వచ్చారనీ, అయినా ఎన్నడూ తనపై అసత్య ఆరోపణలను చేసిన వారిని పన్నెత్తు మాట అనలేదనీ, ఏ రోజూ రాద్ధాంతం చేయలేదనీ అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిచినా వెళ్లారని పొగిడేస్తూ పనిలో పనిగా.. ఈడీ విచారణకు పిలవడంపై రాద్ధాంతం చేసి ఆందోళనలకు దిగిన సోనియా, రాహుల్ గాంధీలను పరోక్షంగా విమర్శించారు. పార్లమెంటులో ట్రిపుల్ తలాక్, అర్టికల్ 370పై అమిత్ షా చేసిన ప్రసంగాలు బ్రహ్మాండమని ఆకాశానికి ఎత్తివేసిన రాజ్ నాథ్ సింగ్ శబ్దాంక్ పుస్తకం భవిష్యత్ తరాలకు ఒక దీపస్తంభంగా నిలుస్తుందని అన్నారు.