మృత్యువు కూడా వారిని విడదీయలేదు!
posted on Jun 24, 2014 6:26PM

రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రేమలత, శాంతిలాల్ జైన్ ఎంతో అన్యోన్యంగా వుంటారు. వీరిద్దరూ కొంతమంది బంధువులతో కలసి ఢిల్లీ నుంచి గౌహతికి విమానంలో వెళ్తున్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హేమలత తనకు గుండెలో నొప్పిగా వుందని చెప్పింది. పైలెట్ విమానాన్ని అర్జెంటుగా వెనక్కి మళ్ళించి ఢిల్లీలో లాండ్ చేశాడు. బంధువులు ప్రేమలతని హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆస్పత్రిలో ఆమె మరణించింది. ఆమె మరణించారని వైద్యులు అలా ప్రకటించాలరో లేదో ప్రేమలత భర్త శాంతిలాల్ జైన్ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణం వదిలారు. అలాగే రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం కుకులూరు వద్ద భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.