హైద్రాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  మ్డంగళవారం (నవంబర్ 5) హైద్రాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బాటు మంత్రి వర్గ సహచరులు పలువురు పాల్గొని రాహుల్ కు ఘన స్వాగతం పలికారు.  మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజిబిజిగా ఉన్న రాహుల్ రెండు గంటల నిమిత్తం బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ కు చేరుకున్నారు. రోడ్డు మార్గాన ఈ సెంటర్ కు చేరుకున్నాారు.  కుల గణన కార్యక్రమంపై ప్రజా సంఘాలు,  బిసి సంఘాల ప్రతినిధులతో రాహుల్ చర్చలు జరిపారు. వారి సలహాలను కూడా రాహుల్ స్వీకరించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu