రాగిన్‌.. ఎటు వెళ్లావ్‌..!

మ‌న‌సుకు గాయం కానంత‌వ‌ర‌కే అంద‌రితో, అంద‌రిలో .. ఇంట్లో, బ‌య‌టా! గాయ‌ప‌డితే మాత్రం మ‌నిషి మ‌నిషిలో వుండ‌రు.. దానికి వ‌య‌సుతో నిమిత్తం లేదు. . డెబ్బ‌య్యేళ్ల‌వార‌యినా..ఇదుగో ఈ ఆరేళ్ల రాగిన్ అయినా! అవును. రాగిన్  త‌ల్లి  శ‌నివారం చ‌నిపోయింది. మంగ‌ళ‌వారం నుంచి రాగిన్ క‌న‌ప‌డ‌టం లేదు. ఆమె కోసం బంధువులు, స్నేహితులు, పోలీసులు కూడా వెతుకుతున్నారు. 

మిన్నొసాటాలో రాగిన్ త‌న త‌ల్లితో వుండేది. ఇద్ద‌రూ మంచి స్నేహంగానూ వుండేవార‌ట‌. ఏమ‌యిందో ఏమో రాగిన్ త‌ల్లి వేడ్ ఆత్మ‌హ‌త్య చేసుకుంది.  39 ఏళ్ల వేడ్ కి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ల‌సిన ప‌రిస్థితులూ ఏమీ లేవ‌ని చుట్టుప‌క్క‌ల‌వారూ అంటున్నారు. ఆత్మ‌హ‌త్య కేసు ఛేదించ‌డం సుల‌భ‌మే కానీ ఇలా మ‌న‌సు విరిగి ఇంట్లోంచి వెళిపోయిన పిల్ల‌ల‌ను వెత‌క‌డం మ‌హాక‌ష్టం అది అనుకున్నంత సుల‌భ‌మైతే కాద‌ని ఏకంగా మిన్నొసాటా పోలీసులే అంటున్నారు. ఆ పాప 2 వ తేదీన ఎవ‌రికో క‌నిపించింద‌ని విన్నారు. కానీ అందులోనూ నిజం లేద‌ని తేలింది. 

ఎవ‌రిక‌యినా చెప్పి వెళ్లే వ‌య‌సూ కాదు. ఆమెను ఎవ‌రూ కిడ్నాప్‌చేసే అవ‌కాశ‌మూ లేద‌ట‌. మ‌రి రాగిన్ అలా త‌న ఇల్లు విడిచి వెళ్ల‌గ‌లిగింది.  మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌రైన త‌ల్లి వేడ్ మ‌ర‌ణం ఆమెను మాన‌సికంగా  కృంగ‌దీసిందేమో అని డాక్ట‌ర్లు అంటున్నారు. కానీ అంత‌గా మ‌నోవ్య‌ధ చెందే వ‌య‌సు కాద‌ని, ఆ బాధ ఆమెకు అవ‌గాహ‌న వుండే అవ‌కాశ‌మే లేద‌ని మ‌రి కొందరి అభిప్రాయం. ఏమైన‌ప్ప‌టికీ రాగిన్ మాత్రం త‌ను పుట్టి పెరిగిన వూరు, త‌న స్నేహితుల‌ను, చుట్టుప‌క్క‌ల‌వారినీ అమాంతం వ‌దిలేసి వెళిపోయింది.  రాగిన్ తిరిగి రావాల‌ని ఆమె స్నేహితులు ఒంట‌రిగా బాధ‌ప‌డుతున్నారు. ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. 

రాగిన్‌.. ప్లీజ్ తిరిగిరా.. నీ కోసం యావ‌త్ మిన్నొస‌టా ఎదురుచూస్తోంది.
........