ర‌గులుతున్న అస‌మ్మ‌తి సెగ‌

ఒకే ప్రాంతీయుల‌ యినా, మంచి స్నే హితులైనా సీరియ‌ స్‌గా విభేదాలు త‌లె త్తితే వారు క‌ల‌వ‌డం దుర్ల‌భం. అలాంటిది ఒక రాజకీయ‌ పార్టీ లో ఉండేవారికి అవ‌ మాన‌ ప‌డుతు న్నా మ‌న్న భావ‌న తొలి చేస్తే సాధార‌ణంగా పార్టీ నుంచి దూర‌మ‌ వుతారు. తెలంగా ణా కాంగ్రెస్‌పార్టీలో మాత్రం అన్న‌ ద‌మ్ములతో పార్టీలో అస‌మ్మ‌తి సెగ రేగుతూనే ఉంది. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోరి రాజీనామా చేస్తు న్నాన‌ని ఇటీవ‌లే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌ర‌యిన రాజ‌గోపాల్ రెడ్డి పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. దాన్ని గురించి పార్టీలో నాయ‌కులు రాజ‌గోపాల్‌ను తిట్ట‌డం ఆరంభించారు. ఆర్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రీ విరుచుకుప‌డ్డారు. క్ర‌మేపీ ఆ ఆగ్ర‌హం కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి మీద కూడా ప్ర‌ద‌ర్శిస్తూండ‌డంతో వెంక‌ట‌రెడ్డి అవ‌మాన ప‌రుస్తు న్నారంటూ ఆగ్ర‌హించారు. 

కాగా రేవంత్ అయ్యో మిమ్మ‌ల్ని కాదు, మీరు మా స్టార్ కాంపెన‌ర్ అంటూ సారీ చెప్పారు. కానీ వెంక‌ట రెడ్డి ఆగ్ర‌హం చ‌ల్లార‌ లేదు. దీనికి తోడు అద్దంకి ద‌యాక‌ర్ కూడా విరుచుకుప‌డ‌టం కూడా ఎంపీ వెంక‌టరెడ్డిని మ‌రింత బాధ‌ పెట్టింది. వీరి వ్య‌వ‌ హారంపై  పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాన‌ని మొండి కేశారు.
 
ఎంపీ వెంకట్‌రెడ్డి బెట్టువీడక పోవడంపై  కాంగ్రెస్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఇంట్లో మల్లు రవి, బెల్లయ్య నాయక్‌, చరుణ్‌ కౌశిక్‌ భేటీ అయ్యారు. క్షమాపణలు చెప్పినా కూడా దయా కర్‌ను టార్గెట్‌ చేయడంపై అసంతృప్తి చేస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని నిర్ణయం తీసు కున్నారు. వెంకట్‌రెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. 

ఎంపీ వెంకటరెడ్డి కి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో తాను చేసిన వాఖ్య లకు బాధ‌పడుతున్నట్లు తెలిపారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని అద్దంకి దయాకర్ కోరారు. కాగా... కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్‌లో రేవంత్ క్షమాపణ వీడియోను పోస్ట్ చేశారు. చుండూరులో జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బహిరంగంగా తిట్టడంపై బాధ్యత వహిస్తూ ఎంపీకి రేవంత్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదని, దీనిని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచించారు.