తిరుమల నడకదారిలో కొండచిలువ.. భయంతో బెంబేలెత్తిన భక్తులు

తిరుమల నడక దారిలో భారీ కొండచిలువ  హల్చల్  చేసింది.   పది అడుగుల పొడవు ఉన్న కొండచిలువను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. జనం అలికిడి, హడావుడితో ఆ కొండచిలువ నడకదారిలోని ఓ దుకాణంలోకి దూరింది.  

దుకాణదారుడు, భక్తులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన స్నేక్యాచర్ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో  నడకదారిలో ఉన్న దుకాణాల యజమానులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu