Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ విమర్శలకు దీటుగా బదులిచ్చిన పీవీ సింధు.!
posted on: Aug 6, 2026 12:29PM

ఇండియన్ ఏస్ షట్లర్, తెలుగుతేజం, ఒలింపిక్ పతకాల విజేత పి.వి. సింధు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వైసీపీయులకు గట్టి రిటార్డ్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు అందించి, వరుసగా 2 ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధుపై వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తనపై వస్తున్న విమర్శలకు పీవీ సింధు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ వివాదానికి ప్రధాన కారణం గత ప్రభుత్వాలు క్రీడాకారులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారమే. గతంలో ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో పి.వి. సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం కోసం రెండెకరాల స్థలం కేటాయించింది.
అంతే కాకుండా ఆమె సాధించిన ఒలింపిక్ విజయాలకు గుర్తుగా ఏపీ ప్రభుత్వం 30 లక్షల నగదు బహుమతి, ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమెను ఘనంగా సత్కరించాయి. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణల నేపధ్యంలో వైసీపీ సోషల్ మీడియా సింధును లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ కు దిగింది. క్రీడల్లో దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన క్రీడాకారిణిని కేవలం రాజకీయ కోణంలో ట్రోల్ చేయడంపై క్రీడాభిమానులు, సాధారణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సింధు సైతం తాను ఏ పార్టీకి పరిమితం కాదని, భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నానని స్పష్టం చేశారు. క్రీడాకారుల కష్టాన్ని, వారు సాధించిన అంతర్జాతీయ విజయాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని తేల్చిచెప్పారు. సైబర్ బుల్లీయింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్ అనేవి క్రీడాకారుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, ప్రతికూల వ్యాఖ్యలను అధిగమించి మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే తన నైజమని సింధు పేర్కొంది.
వైసీపీ సోషల్ మీడియా విశాఖలో సింధు ఏర్పాటు చేయనున్న క్రీడా, విద్యా సంస్థకు రెండో సారి భూమి పూజ చేయడంపై విమర్శలు గుప్పిస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు పాల్పడ్డారు. దీనిపై సింధూ ఘాటుగా రిప్లై ఇస్తూ.. ఈ ప్రాజెక్టుకు మరోసారి భూమి పూజ ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన వీడియోలో భూమి పూజ కార్యక్రమాన్ని రెండు సారి నిర్వహించడానికి గల కారణాలను వివరిస్తూ సింధూ.. మొదటి భూమి పూజకు కేవలం ఏడు గంటల ముందు తనకు సమాచారం ఇచ్చారనీ, దీంతో అప్పుడు తన కుటుంబం, సన్నిహితులు, తన విజయాలలో అండగా నిలిచిన పలువురు హాజరు కాలేకపోయారనీ పేర్కొన్న సింధు, వారందరి కోసం మరోసారి భూమి పూజ నిర్వహించాల్సి వచ్చిందని వివరించింది.
అంతే కాకుండా మొదటి భూమి పూజ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంతో ఈ ప్రాజెక్టు బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి, సమగ్ర క్రీడా, విద్యా సంస్థగా విస్తరించిందని పేర్కొన్న సింధు.. ఈ విస్తరించిన ప్రాజెక్టుకు ఒక కొత్త ప్రారంభాన్ని ఈ రెండో సారి చేసిన భూమి పూజ ద్వారా వచ్చిందన్నారు. సింధూ వివరణ పట్ల నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమర్శకులకు గట్టిగా బదులిచ్చి వారి నోరు మూయించిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
PV Sindhu, YCP Trolls, Sindhu Hits Back, Cyber Bullying, PV Sindhu Vizag Land, Badminton, Telugu One


%20(1)(12).webp)



