షేర్లలో ఇన్వెస్ట్ చేయొద్దు.. బంగారం.. బంగారం బిస్కెట్లు కొనండి!
posted on Oct 17, 2025 10:05AM

చాలా మంది షేర్లలో పెట్టుబడులు పెట్టి.. సమయం, సొమ్ము వృధా చేసుకుంటారు కానీ.. గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే.. ఆ రిటర్న్సే వేరుగా ఉంటాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.. ఇదిగో ఆర్బీఐ ఎస్జీబీ అనే గోల్డ్ బాండ్లు. ఇవి ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున లాభాల బాట పట్టించాయి. ఆర్బీఐ 2017 అక్టోబర్ 9, 11వ తేదీల్లో గోల్డ్బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 338 శాతం లాభాలను తెచ్చి పెట్టింది.
అప్పట్లో గ్రాము బంగారం రూ. 2, 866 గా ఉండేది. అదే గ్రాము ధర ఇప్పుడు రూ. 12, 567గా నిర్ణయించింది ఆర్బీఐ. దీంతో ఎనిమిదేళ్లలో ఒక గ్రాముకు 9, 701 రూపాయల ఆదాయం వచ్చిందంటే గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ మెంట్ తో వచ్చే లాభాలకు ఆకాశమే హద్దు అనిపించక మానదు. ప్రస్తుతం బంగారం ధర పైపైకి ఎగబాకేదే తప్ప తగ్గేది కాదు. దీంతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారంతా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. లాభాల బాట పడుతున్నారు. కళ్లు మూసుకుని చేయాల్సిన ఇన్వెస్ట్ మెంట్లు గోల్డ్ లో పెట్టుబడులు పెట్టడమే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.
2015 నవంబర్ లో ఈ గోల్డ్ బాండ్లను రిలీజ్ చేసింది ఆర్బీఐ. వీటి కాల పరిమితి 8 ఏళ్లు. అయిదేళ్లు నిండాక రిడెమన్షన్ చేసుకోవచ్చు. లేదా పూర్తి కాల పరిమితి ఉంచుకోవచ్చు. రిడెమన్షన్ టైంలో గ్రామ ధర నిర్ణయించేందుకు ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ నిర్ణయించే సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు. అయితే 2024 తర్వాత కేంద్రం ఈ బాండ్లను రిలీజ్ చేయలేదు. కారణం బంగారం పై ఎక్కువ మొత్తం రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తున్నది కాబట్టి.
అయితే చాలా మంది బులియన్ ఎక్స్ పర్ట్స్ ఇప్పుడు గోల్డ్ బాండ్లు లేవు కనుక బంగారం బిస్కెట్లు, డాలర్లను కొని పెట్టుకోమని సూచిస్తున్నారు.