సైకోపాత్ లైఫ్ పార్ట్నర్ లకు ఉండే లక్షణాలు ఇవే..!
posted on Jan 18, 2025 9:30AM

సైకోపాత్.. వినడానికి కాస్త భయం పుట్టించే పదం. మానసికంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు సైకోపాత్ లాగా బిహేవ్ చేస్తుంటారు. సాధారణంగా బయట ఎవరికో ఇలాంటి సమస్య ఉంటే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులతో జీవితం పంచుకోవాల్సి వస్తే మాత్రం అది నరకమే. సైకోపాత్ ల ప్రవర్తన, వారి స్వభావం చాలా ప్రమాదకంగా ఉంటుంది. సైకోపాత్ లకు ఉన్న కొన్ని లక్షణాలు తెలుసుకుంటే..
సైకోపాత్ లక్షణాలున్న లైఫ్ పార్ట్నర్ ను గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని దాచడంలో చాలా తెలివైనవారు. సైకోపాత్ భాగస్వామితో జీవించడం మానసిక, భావోద్వేగ ఆరోగ్యానికి ప్రమాదకరం.
అబద్దం చెప్పే అలవాటు..
సైకోపాత్‌లు తమ అసలు వ్యక్తిత్వాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు చిన్న విషయాల గురించి కూడా అబద్ధాలు చెబుతారు. తమ అబద్ధాలను నిజమని నిరూపించుకునేందుకు కొత్త కథలను అల్లుతూనే ఉంటారు. అతని మాటలు తరచూ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి.
ఎమోషన్స్..
ఎలాంటి తప్పు చేయకపోయినా, ఏమాత్రం సంబంధం లేకోపోయినా సరే.. తప్పు చేసిన భావనను కల్పించేలా వారు ప్రవర్తిస్తారు. అవి వారితో రిలేషన్ లో ఉన్న వారిని మళ్లీ మళ్లీ అపరాధ భావంలోకి లాగేస్తాయి. సైకోపాత్ లైఫ్ పార్ట్నర్స్ తమ భాగస్వాములను నియంత్రించడానికి ఎమోషన్స్ తో ఆడుకుంటారు. ఇలాంటి వారితో రిలేషన్ లో ఉంటే తమ రిలేషనే్ బలంగా ఉందని వారితో రిలేషన్ లో ఉన్నవారికి అస్సలు అనిపించదు.
విమర్శ..
సైకోపాత్‌లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని అవమానపరచడానికి ఎటువంటి చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. అలాంటి వారికి తమతో రిలేషన్ లో ఉన్న వారి తప్పులను పదే పదే ఎత్తి చూపడం అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా వారితో రిలేషన్ లో ఉన్న వారి ఆత్మగౌరవాన్ని నాశనం చేసేందుకు చాలా ప్రయత్నిస్తారు.
ప్రతిస్పందన..
సాధారణంగా మనిషికి ఎదుటివారు ఎమోషన్స్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ కావడం అనే అలవాటు ఉంటుంది. కానీ సైకోపాత్ లతో రిలేషన్ లో ఉంటే వారి నుండి ఎలాంటి ప్రతిస్పందన లభించదు. ఎమోషన్ అవుతున్న వ్యక్తులను ఊరడించక పోగా.. విమర్మలు గుప్పించి మరింత బాధపెట్టడానికి, తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే వారు ఆలోచిస్తారు.
నిందలు..
సైకోపాత్ లు తాము చేసే తప్పులను ఎప్పుడూ అంగీకరించరు. ప్రతిసారీ ఎదుటి వారినే నిందిస్తుంటారు. తాము చేసిన తప్పులకు కూడా ఎదుటివారినే భాద్యలను చేసి వారిని దూషించి మరీ సంతోషపడతారు. వారికి అహం కూడా ఎక్కువగా ఉంటుంది. వారి అహాన్ని తృప్తి పరచుకోవడానికి తమ భాగస్వామిని ఎంత బాధపెట్టడానికి అయినా సైకోపాత్ లు వెనుకాడరు.
నియంత్రణ..
సైకోపాత్ లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని ఎప్పుడూ నియంత్రించాలని కోరుకుంటారు. వారు ప్రథితీ తమ కనుసన్నల్లో జరగాలని అనుకుంటారు. వారి నిర్ణయాలతో వారి భాగస్వాములను పదే పదే ఇబ్బంది పెడతారు. వారితో రిలేషన్ లో ఉండేవారు చాలా వరకు స్వతంత్రత కోల్పోతుంటారు. ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేరు.
కోపం..
సైకోపాత్ లకు కోపం ఎక్కువ. చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి కోపంలో హింసాత్మకంగా కూడా మారుతుంటారు . ఆ తరువాత తమ ప్రవర్తనకు తమ భాగస్వామినే భాధ్యులను చేస్తారు.
*రూపశ్రీ.