యూనివర్సిటీ లో.. రూమ్ నెంబర్  100..

అది ఒక యూనివర్సిటీ, యూనివర్సిటీ  అనగానే మన అందరికి  చదువు, భవిష్యతు నాయకులకు, పోరాటాలకు పుట్టిన ఇల్లు అని అనుకుంటాం. ఐతే ఈ యూనివర్సిటీ  మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. యూనివర్సిటీ హాస్టల్‌లోని 100 నంబర్ గదిలో ఆ వర్సిటీకి సంబంధం లేని లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. అతడు అక్కడికి ఎందుకు వచ్చాడు..? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు..? అనే ప్రశ్నలు మీకు కలిగే ఉంటాయి.. పూర్తి వివరాల కోసం ముందు వెళ్దాం పదండి. 

ఓపెన్ చేస్తే.. అది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఫిలిబిత్‌ పట్టణానికి చెందిన 24 ఏళ్ళ వ్యక్తి. అతని పేరు అభిషేక్ కుమార్ సక్సేనా..అతను అలీగఢ్ ఏఎన్సీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. తన కాలేజీకి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న ఆయన.. వారం రోజుల క్రితం దానిని ఖాళీ చేసి వచ్చి యూనివర్సిటీ హాస్టల్‌లోకి మకాం మర్చాడు. ఏమైందో తెలియదు గాని.. అభిషేక్ కుమార్  హాస్టల్లోని 100 నెంబర్ గదిలో చేసుకున్న ఆత్మహత్య ప్రస్తుతం మిస్టరీగా మారింది. అయితే పోలీసులు రంగం లోకి దిగి అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు. అతని  ప్రేరేపించింది ఎవరు..? అనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు.  ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే..? ఏం చెయ్యాలో మీకు తెలుసు కదా..? 

అభిషేక్ కుమార్ రాత్రి వరకు బాగానే  ఉన్నాడు. తెల్లవారే సరికి ఆత్మహత్య చేసుకుని శవంగా మిగిలాడు. అయితే అతను ఆత్మహత్యకు ముందు ఆగ్రాకు చెందిన మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆ తర్వాతనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఆగ్రాకు చెందిన మహిళ తన సోదరుడిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని, ఆమె వేధింపులు, ఒత్తిడి కారణంగా సక్సేనా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. అయితే అభిషేక్ సక్సేనాకు యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేనప్పుడు సులేమాన్ హాస్టల్‌లోని 100వ నెంబరు గదిలో ఎందుకు నివసిస్తున్నాడన్న సందేహం కూడా  పోలీసులకు లేకపోలేదు. పోలీసులు ఆ కోణం లో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.