ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిటిజన్ చార్టర్ అమలు చేయాలి ? సామాన్యుడి డిమాండ్

ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యుడి ని నిలువునా దోచేస్తున్నాయి. రోగులకు  సర్జరీకి అసలు అయ్యేది ఎంత? అన్న అంశం పై అటు రోగికి కాని రోగి బంధువుకు కాని కనీస అవగాహన లేకపోవడం తో ఆసుపత్రుల భాగోతం శ్రుతిమించి రాగాన పడుతోంది. జనరల్ వార్డ్ బెడ్ రోజుకు ఎంత? షేరింగ్ రూమ్ రోజుకు ఎంత? స్పెషల్ రూమ్ రోజుకు ఎంత ?అన్న విషయం   రోగి బంధువుకు  అవగాహాన లేదు సరికదా  ఏ సర్జరీకి ఎంత అవుతుంది. ఆయా ఆసుపత్రులలో ఐ సి యు బెడ్ ఎంత? నాన్ ఏ సి బెడ్ ఎంత? రోజుకు ఎంత అన్న సమాచారం తప్ప ని సరిగా సిటిజన్ చార్టర్ రూపం లో పెట్టాల్సిందే. అలాగే డాక్టర్ కన్సల్టెంట్ ఫి ఎన్నిసార్లు కు వినియోగించవచ్చు ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థ వచ్చాక ఆయా ఆసుపత్రులలో ఎన్నిపడ కల ఆసుపత్రి ఏది ఎక్కడఉంది? ప్రతి టెస్ట్ కు ఎంత ఖర్చు అవుతుంది అన్న సమాచారం సిటిజన్ చార్టర్ లో పెట్టాలి. అక్కడి డాక్టర్ల వివరాలు అయాశాఖలు. హెచ్ ఓ డి వివరాలు సిటిజన్ చార్టర్ లో చేర్చాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఈ సిటిజన్ చార్టర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒకటే మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి పేరుతో మీటర్ నటీ ఆసుపత్రి మల్టీ స్పెషలిటి ఆసుపత్రి పేరుతో వైద్యం చేసినఘటన వెలుగు లోకి వచ్చింది. ఇది ఇలా ఉంటె మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకుండానే ఆసుపత్రి ని నడుపుతూ రోజుకు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. 

గతంలో కీళ్ళ మార్పిడి సర్జరీ కి లక్షనుండి లక్షా యాభై రూపాయలు సర్జరీకి అయ్యేఖర్చు కోరోనా తరువాత కీళ్ళ మార్పిడి సర్జరీ నాలుగు లక్షలకు చేరింది ఇది ప్యాకేజి మాత్రమే. అయితే సర్జరీ తరువాత రోగికి వచ్చిన ఫైనల్ బిల్ ఎనిమిది లక్షలు దీంతో లబోదిబోమన్న రోగి అంతబిల్లు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడినించి తేవాలో అర్ధం కాక తీవ్ర విషాదం లో మునిగి పోయారు. ఇంతేకాదు కేవలం సర్జరీ కి చెప్పింది నాలుగు లక్షల యాభై వేలు. కాని వచ్చిన బిల్లు ఎనిమిది లక్షలు దిస్చార్జికి ముందు కట్టి వెళ్ళాలంటూ హుకూం జారీ చేసారు సదరు అకౌంట్స్ మనేజర్  అప్పటి కప్పుడు కట్టాలంటే ఇల్లె  అమ్ముకోవాల్సిందే. మామూలు ప్యాకేజికి అదనంగా జిఎస్టే  అంటూ అదనంగా,ఇతర సేవల రూపంలో దోచేయడం పై సామాన్యుడు తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నాడు. అప్పటికప్పుడు అప్పు పుట్టడం అసాధ్యం అసలు ఇన్సూరెన్స్ పోగా అదనపు భారం పడుతూ ఉండడం తో ఏమిచేయాలో అర్ధం కాక వెర్రి చూపులు చూస్తూ చేసేది లేక కట్టేవేలుతున్నారు.

ఇదే పరిస్థితి మధ్య తరగతి ఆర్ధికంగా దిగువన ఉన్న వాళ్ళకే వస్తే ఇంకేముంది డబ్బు కట్టలేక ఆత్మహాత్య మినహా మరోమార్గం లేదని సామాన్యుడు వాపోతున్నాడు. అందుకే  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్,లివర్  ట్రాన్స్ ప్లాంట్,హార్ట్  ట్రాన్స్ ప్లాంట్  కి ఎంత ఖర్చు అవుత్నుందో కూడా అంచనా వేయలేము. అసలు సస్త్రచికిచ్చల ఖర్చు సామాన్యుడు భరించగాలడా? వీటి వివరాలను అయ్యే ఖర్చును సిటిజన్ చార్టర్ లో పెట్టాలి అన్నది సామాన్యుడి డిమాండ్. సిటిజన్ చార్టర్ లో స్పష్టంగా ప్రకటించాలని. సాధారణ సర్జరీ లప్రో స్కోపిక్ సర్జరీ,బెరియాటిక్ సర్జరీ వికటించిన సందర్భాలు ఉన్నాయి.రోగి సర్జరీ టేబుల్ పైనే చనిపోయిన ఘటనలు చూసాం. అయితే సర్జరీ ముందుగానే వివరాలు చెప్పకుండా కేవలం కౌన్సిలింగ్ చేసి నిరయం కాకుండా సర్జరీకి వెళ్ళే ముందు ఎన్ ఓ సి పై సంతకం పెట్టించుకోవడం వంటి పద్దతికి స్వస్తి చెప్పాలి రోగి పూర్తి బాధ్యత ను ఆసుపత్రి తీసుకోవాలి. రోగికి చేస్తానన్న సర్జరీ కాక మరోసర్జరీ చేసినా, చెప్పిన ప్యాకేజికి బదులు అదనపు ప్యాకేజి కింద అదనపు డబ్బు వసూలు చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకునే వీలును ప్రభుత్వం కల్పించాలని. ఒకవేళ రోగి ఏ పరిస్థితిలో చనిపోయినా పూర్తి బాధ్యత నష్టపరిహారం.

ఆసుపత్రి చెల్లించే వీలునుకల్పించి సామాన్యుడి ఆరోగ్యానికి బద్రత దోపిడీని నివారించే ఆరోగ్య బిల్లును పర్ల్యమేంట్ లో ప్రవేసపెట్టాలని ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేసే వీలును కల్పిస్తూనే సామాన్యుడి ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేసే విధంగా ఆరోగ్య శాఖ కసరత్తులు చేయాలాని సామాన్యుడు మొరపెట్టుకున్తున్నాడు.  ఎసర్జరీకి ఎంత రేటును బట్టి సర్జరీ నిర్ధారిస్తారు ఎఫారిన్ బాడీ వాడతారు. సర్జరీకి వాడె స్టంట్,సర్జరీ కోసం వాడే లెన్స్ వాటివివరాలు రోగి ఎంచుకున్న సర్జరీ విధానాన్ని సర్జరీకి పట్టే సమయం వాటితో పాటు ఎంతమంది సర్జరీ చేస్తున్నారు వారివివరాలు రోగి బందువులకు అందించాలి ఆతరువాతే ఎన్ ఓ సి పై సంతకాలు పీట్టె వీలును రోగికి రోగి తాలూకు  బంధువుకు వివరించాలని సామన్యుడు సూచిస్తున్నాడు. ఆత్రువాతే ఏ కేటగిరీ రూమ్ రెంట్ నర్సింగ్ సేవల ఖర్చు ,అత్యవసర సమయంలేదా సర్జరీ సమయంలో వినియోగించిన ఇతర సామాగ్రి మందులు సైతం రోగికి లేదా రోగి బంధువులకు ఖచ్చితంగా తేలపాలాని ఏ సేవ చేసినా అయ్యే ఖర్చు అదనపు ఖర్చు ఘంటకు ఎంత అనే వివరాలు పూర్తిగా సిటిజన్ చార్టర్ లో పొందుపరచాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఊహించని బిల్లుల తో అతలాకుతలం అయిపోతున్నాడు అసలు సామాన్యుడి కి వైద్యం తీసుకోవాలంటే ముందు నుయ్యి వేనుకగోయ్యి మాదిరిగా కనిపిస్తోందని దీనికి బదులు చనిపోతే బాగుండునని రోగులు వాపోతున్నారంటే పరిస్తి ఎలా ఉందొ రోగి బంధువులు రోగి తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం  ఏమిటి అంటే పిర్రచూసి పీట కన్నుచూసి కాటుక వేసారు అన్నట్లు రోగి ని బట్టి ఆర్ధిక స్థితిని బట్టి ఆరోగి ఏ కేట గిరి కిందకు వస్తుందో ఆ కేటగిరీ కింద ఇచ్చేసేవలు వాటికి ఆయ్యే ట్రీట్మెంట్ ఖర్చు ఐ సి యు లో య్యేఖర్చు,సాధారణ చికిత్చకు వినియోగించే వస్తువులు. చికిత్చ వివరాలు చికిత్చకు వినియోగించిన  పూర్తివివరాలు ఆహారంతో పాటు ఇతర డాక్టర్ల సేవలకు తీసుకునే ఫీజుతోసహా సిటిజన్ చార్టర్ లో పొండుపరచాలని సామాన్యుడు డిమాండ్  చేస్తున్నాడు. మారో అంశం ఏమిటి అంటే  ఆసుపత్రి పేర్లు మారితే ధరలు మారతాయా? ప్రైవేట్ ఆసుపత్రుల పై అజమాయిషీ ఎవరిదీ సేవారంగానికి చెందినా వైద్యం విషయంలో రాష్ట్రప్రభుత్వాల పరిధిలో అంశమా కేంద్రానికి సంబంధం లేదా సామాన్యుడికి ఈధరాఘాతం నుండి బయట పడాలంటే ఏది మార్గం అన్నసామాన్యుడుప్రశ్నలకు సమాధానం ఎవరుఇస్తారు.ప్రభుత్వాలు తమ ఆరోగ్య విధానంలో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి వివరాలు,వారిన్ నైపుణ్యం,వివరాలు సిటిజన్ అందించే సేవలు ఎవరు అందిస్తారు అన్న విషయం  కాంటాక్ట్  నంబర్స్ కూడా అందించాలాని  ఆసుపత్రిలో రోగికి ఏ డాక్టర్ చికిత్చ చేస్తున్నాడు. 

ఆయా ఫ్లోర్ మేనేజర్స్ వివరాలు నర్సింగ్ స్టేషన్ ఫోన్ నెంబర్ వివరాల తోకూడిన ఇంఫోర్మేషణ్ షీట్ ను తప్పనిసరిగా రోగి చేరికకు ముందే ఇవ్వాల ని సామాన్యుడు కోరుకుంటున్నాడు.ఆసుపత్రుల డమాండ్ తట్టుకోవాలంటే లక్షలు ఎలాసంపాదించాలి అన్న మనోవేదనతో రోగి ముందే గుండె పోటు తెప్పించి విధానానికి ఇప్పటికైనా చెక్ పెట్టాలని కోరుతున్నాడు.ఇన్ని 75  సంవత్సరాల స్వతంత్ర దేశ చరిత్రలో  ప్రజా ఆరోగ్యానికి అసలు ప్రభుత్వాలు ఖర్చుచేసింది ఎంత పట్టణాలలో దోపిడీకి గ్రామాలలో కార్పోరేట్ అసుపత్రులపై నియంత్రణ అవసరం ఆసుపత్రులలో ధరల నియంత్రణకు సిటిజన్ చార్టర్ కు డిమాండ్. లేదంటే రానున్న కాలం లో ప్రాజా ఆరోగ్యం  గాలిలో దీపం లాగానే ఉంటుంది. ఆరొగ్యానికీ రక్షణ ఎవడు.బిల్లు పోటును ఆపేది ఎవడు అన్నది మారోప్రస్నమిగిలింది. ప్రజా ఆరోగ్యానికి ఎప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాలికలు ఉన్నాయో అయాపార్తీలు తమ మ్యానిఫెస్టోలో స్పష్టంగా పెర్కొవలాని సగటు సామాన్యుడు కోరుకుంటున్నాడు.