ప్ర‌తిష్ఠ కోల్పోయిన చైనా న‌గ‌రం!

ఇంటికి ఆనంద‌ నిల‌యం అని పేరు పెట్ట‌గానే స‌రిపోదు. ఇంట్లో అంతా నిజంగానే హాయిగానూ, ఆనందం గానూ వుండాలి. న‌గ‌ర‌మంటే భారీ క‌ట్ట‌డాలు, భ‌వ‌నాలు, అంద‌మైన రోడ్లు, ప‌బ్బులూ కాదు. ప్రాంతీయ పాల‌న బాగుండాలి, ప్ర‌జ‌ల వ్య‌వ‌హార శైలి బాగుండాలి, అతిధుల‌ను చ‌క్క‌గా ఆద‌రించాలి. అపుడే  ఆ న‌గ‌రం  ఉత్త‌మ న‌గ‌రంగా పేరు సంపాదించుకుంటుంది.  ఎప్పుడూ గొడ‌వ‌లు, కొట్లాట‌లు, హింస‌, మ‌హి ళ‌ల‌పై అత్యాచారాలు, దాడులతో నిత్య న‌ర‌కంగా మారుతుంటే ఏ న‌గ‌ర‌మ‌యినా మ‌హాన‌గ‌రం అనిపించు కోదు. విశ్వనగరమన్న కితాబులూ సరితూగవు. న‌గ‌రానికి వున్న ప్ర‌తిష్ట పూర్తిగా దెబ్బ‌తింటే బ‌య‌టి నంచి వ‌చ్చే అతిధులు భ‌య ప‌డ‌తారు. అప్ర తిష్ట పాల‌యి అంద‌రి దృష్టిలో మామూలు ప‌ట్ట‌ణంగా మిగిలిపోతుంది. ఇపుడు ఈ దుస్థితికి  చేరు కుంది చైనాలోని  తాంగ్‌షాన్ న‌గ‌రం. యువ‌త చేసిన చెత్త ప‌నివ‌ల్ల  ప‌ట్ట‌ణం ప్ర‌తిష్ట పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌తి ష్టాత్మ‌క న‌గ‌రాల్లో ఒక‌టి అన్న స్థాయినీ కోల్పోయింది!

చైనాలో తాంగ్‌షాన్ కు ఎంతో మంచి న‌గ‌రంగా గుర్తింపు వుంది. ఈమ‌ధ్య‌నే ఆ న‌గ‌రంలో వూహించ‌ని సంఘ ట‌న జ‌రిగింది. న‌గ‌రంలోని ఒక చైనీస్ రెస్టారెంట్ కి వ‌చ్చిన న‌లుగురు అమ్మాయిల‌ను కొంద‌రు కుర్రాళ్లు వెంబ‌డించారు.  వారిలో ఒక‌డు ఒక అమ్మాయితో అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించాడు. ఆమె తిర‌స్కరించింది. కానీ అత‌ను ఆమె జుత్తుప‌ట్టుకుని వీధిలోకి లాక్కొచ్చి మ‌రీ కొట్టాడు. త‌న ఇష్టాన్ని కాదంటావా అని తిట్ట‌ని తిట్టు తిట్ట‌కుండా తిట్టాడు. అంతేకాదు అత‌నితోపాటు అత‌ని స్నేహితులు కూడా ఆమె స్నేహితు ల‌పై దాడిచేసేరు. గాయ‌ప‌డిన ఇద్ద‌రు అమ్మాయిలు రోడ్డు మీద అలా ప‌డిపోయారు. వాళ్ల‌ని వ‌దిలేసి  ఆ కుర్రాళ్లు పారిపోయారు. ఇద్ద‌రు అమ్మాయిలు తీవ్ర గాయాల‌తో  ఆస్ప‌త్రి ఐసియూ లో వున్నారు. ఈ సంఘ ట‌న ఈ నెల ప‌దో తేదీన జ‌రిగింది. 

మ‌న‌దేశంలో ఏ న‌గ‌రంలోనైనా ఇది చాలా మామూలు సంగ‌తే. కానీ  2011 నుంచి ఉత్త‌మ న‌గ‌రంగా ఎంపిక వుతూన్న‌  చైనా ఉత్త‌ర హెబీ ప్రావెన్స్‌లోని తాంగ్‌ష‌న్  న‌గ‌రంలో ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప్ర‌జ‌లు గౌర‌వా నికి  దెబ్బగా భావించా రు. ప్రాంతీయ అధికారులు అస‌లు ఈ  సంఘ‌ట‌న  గురించిన పూర్వాప‌రాలు తెలుసుకోవ‌డానికి  ఆ  రెస్టారెంట్  సిసి టివి కెమెరాల‌ను ప‌రిశీలించారు. ఆ సంఘ‌ట గురించి వ‌చ్చిన ఫిర్యాదులు  నిజ‌మేన‌ని  తేలింది. ప్ర‌జ‌లు  ఈ సంఘ‌ట‌న పట్ల పెద్ద ఎత్తున వుద్య‌మించారు. ఈ  సంఘ ట‌న‌కు పాల్ప‌డ‌న‌వారిగా అనుమానిస్తూ పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇదంతా  ఒకెత్త‌యితే, ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను వంద‌లసార్లు ప్ర‌జ‌లు చూసి అస‌హ్యిం చుకుంటున్నారు. తాము నివ‌సిస్తున్నది ఇంత‌టి ద‌రిద్ర‌పు న‌గ‌రంలోనా అనుకుంటున్నారు. దీంతో అక్క‌డి  ప్ర‌భుత్వం జాతీయ ప్ర‌తిష్టాత్మ‌క న‌గ‌రాల జాబితా నుంచి తాంగ్‌ష‌న్ న‌గ‌రం పేరును తొల‌గించా రు.  

ఇది నిజంగా ఎంతో హ‌ర్ష‌ణీయం. ప్ర‌భుత్వం, ప్రాంతీయ అధికారులు ఇంత‌టి నిర్ణ‌యం తీసుకోవడం లో త‌మ దేశంలో ప‌ట్ట‌ణాలు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వుంటున్నాయ‌న్న‌ది  తెలియ‌జేశారు. మ‌న దేశంలో పేరు గొప్ప వూరు దిబ్బ అన్న సామెత‌కు బాగా ద‌గ్గ‌ర‌గా అనేక ప‌ట్ట‌ణాలు వున్నాయి.

దాదాపు ప్ర‌తీ ప‌ట్ట‌ణం, న‌గ‌రం ఏదో ఒక చారిత్రాత్మ‌క క‌ట్ట‌డంతో ఎంతో పేరు సంపాదించుకునే వున్నాయి. ప‌ర్యాట కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. కానీ ఇటీవ‌లి కాలంలో చాలా దారుణ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా యి. ప్ర‌జ‌లు భీతిల్లు తున్నారు. కానీ ప్ర‌భుత్వాలు, పోలీసులు ఆయా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల ప్ర‌తిష్ట దెబ్బ తింటోంద‌న్న జ్ఞానం మాత్రం పొంద‌క పోవ‌డం విడ్డూరం. మ‌న‌కు చైనా ప్ర‌భుత్వం వ‌లె క‌ఠినాతి క‌ఠిన నిర్ణ‌యం తీసుకునే ధైర్యం వుంటే అనేక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు ప్ర‌చారంలో వున్న పేరు, ప్రతిష్ఠ దారుణంగా వెలిసిపోయే అవ‌కాశం చాలా వుంది.