అ ఇద్దరి మధ్యనే పోటీ.. ప్రతిపక్షాలకు పరీక్ష!

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.

నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ముందుగానే తెలిసి పోయింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఏంటో ఇంతో  అనుమానం ఉన్నా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ  గిరిజన మహిళ  ద్రౌపది ముర్మును టం అభ్యర్ధిగా ప్రకటించడంతోనే, అధికార కూటమి అభ్యర్ధి గెలుపు విషయంలో ఉన్న కొద్దిపాటి అనుమనాలు కూడా తొలిగి పోయాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు దేశ రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్నా, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోద్యాత లేక పోవడం ఆయనకు, శాపంగా మారిందని, ఆయనను సమర్ధిస్తున్న పార్టీలు, నాయకులే మధ్యలోనే కాడి వదిలేశారు. 
ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికే ఓ ప్రహసనంగా సాగింది. చివరకు సిన్హా పేరు ఖరారైనా,  ప్రతిపక్ష పార్టీలలో గట్టిగా అయన వెంట నడిచే పార్టీలు ఏవీ, అంటే, ఏవీ కనిపించడం లేదు.

మరోవంక  ఆయన నామినేషన్ విషయంలోనూ పొరపొచ్చాలు బయటకొచ్చాయి.ప్రతిపక్ష  పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికకు సంబంధించి తొలి అడుగు వేసిన మమతా బెనర్జీ, ఆ తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. నిజానికి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో, ఆపార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అయినా, సిన్హా నామినేషన్ కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టారు. అసలు, ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కూడా మమతా దీదీ హాజరు కాలేదు. 

అదలా ఉంటే, సిన్హా నామినేషన్ వరకు, కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసేది లేదని, మొత్తం ప్రక్రియకు దూరంగా ఉన్న, తెరాస ఆ తర్వాత  యశ్వత్ సిన్హాకు ఓపెన్ గా మద్దతు ప్రకటించడమే కాకుండా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ మందీ మార్బలంతో నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇప్పడు తెలంగాణలో అదొక రాజకీయ దుమారంగా మారింది.

అదలా ఉంటే ఇప్పడు యశ్వత్ సిన్హా  ప్రచార యాత్రలో భాగంగా జులై 2 న హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస ఆయన తరపున  ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు అవుతుందా? లేదా అన్నది రాజకీయ మీమాంసగా మారింది. ఇప్పటికే, కాంగ్రెస్, తెరాస జట్టు కట్టారని  బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇప్పడు, ఆ బురద కడుక్కోవడంలో  రేవంత్ రెడ్డి సతమత మవుతున్నారు.

అదలా ఉంటే, ఇప్పటికే బీజేడీ, జేఎంఎం, బీఎస్పీ ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఇప్పడు తాజాగా, జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించింది. పార్టీ నేత, కర్ణాటక మాజే ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ మేరకు ప్రకటన చేశారు. ముర్ము జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడకు ఫోన్ చేసి మద్దతు కోరిన నేపధ్యంలో, ఆమెకు మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని  చెప్పారు. ఈ పరిణామాలు అన్నింటినీ గమనిస్తే, ప్రతిపక్షాల ఐక్యత ఎండమావిగానే ఉందని, ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా అవుతుంది ఆనుకున రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం, ప్రతిపక్షాల అనైక్యతకు అద్దం పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. 

అదలా ఉంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.దాఖలైన నామినేషన్ పత్రాలలో 
28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలించారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని 79 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.

రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలారు. 
జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.