రాష్ట్రపతి ముర్ముకు తృటిలొ తప్పిన ప్రమాదం
posted on Oct 22, 2025 11:01AM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలొ బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ల్యాండ్ అయిన తరువాత ఒక పక్కకు ఒరిగిపోయిన హెలికాప్టర్ ను నిముషాల పై ముందుకు నెట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురక్షితంగా హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఈ సంఘటన కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో బుధవారం (అక్టోబర్ 22) జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రపతి నాలుగు రోజుల కేరళ పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి బయలుదేరి కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ద్రౌపది ముర్ము యథావిథిగా తన పర్యటన కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్ సంఘటన జరిగిన తరువాత ఆమె ముందుగా నిర్ణయించిన కార్యక్రమం మేరకు అక్కడ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.