పీఆర్సీపై హైకోర్టులో పిటిష‌న్‌.. కీలక ఆదేశాలు జారీ..

పీఆర్సీ ఎపిసోడ్ ఏపీ హైకోర్టును చేరింది. పీఆర్సీ జీవోల‌ను స‌వాల్ చేస్తూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీనిపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పిటిషన్ విచారించే రోస్టర్‌లో తమ బెంచ్ లేదని న్యాయస్థానం తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, వ్యక్తిగత పిటిషన్ అవటంతో.. నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పీఆర్సీ పిటిషన్ సీజేకు పంపుతామ‌ని న్యాయ‌మూర్తి చెప్పారు. 

ఏపీలో ఉన్న అందరి ప్రయోజనాలు పిటిషన్‌లో ముడిపడి ఉన్నాయన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉద‌యం పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. నోటీస్ లేకుండా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం.. మ‌ధ్యాహ్నం స్టీరింగ్ కమిటీలోని 12 మంది సభ్యులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, విచారణకు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరు కాలేదు. మ‌రోవైపు, రోస్ట‌ర్ కార‌ణంగా పిటిష‌న్‌ను సీజేఐకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది హైకోర్టు బెంచ్‌.