పీకే నీకు ద‌మ్ముంటే... బీహార్ కింగ‌య్యి చూపించు!

 

పీకే అంటే ప‌వ‌న్ క‌ళ్యాన్ మాత్ర‌మే కాదు ప్ర‌శాంత్ కిషోర్ అని కూడా. ఒక ద‌శ‌లో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ఊపు ఊపింది పీకే మేనియా. 2019 ఎన్నిక‌ల్లో మొద‌ట టీడీపీ చేస్కోవ‌ల్సిన పీకే ఒప్పందం త‌ర్వాత జ‌గ‌న్ ఎగ‌రేసుకుపోవ‌డం. ఆయ‌నిచ్చిన స‌ల‌హా సూచ‌న‌ల‌తో.. ప్ర‌త్యేక హోదా డ్రామాలాడి ఎలాగోలా జ‌గ‌న్ గెల‌వ‌డం ఒక గ‌త చ‌రిత్ర‌. దీంతో పీకే ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ప‌డ్డం క్ర‌మేణా మొద‌లైంది.

అక్క‌డి నుంచి పీకే, ఆయ‌న ఐ ప్యాక్ టీం వేరు వేరుగా మార‌డం.. ఆపై ఆయ‌న శిష్యులు రాహుల్ శ‌ర్మ‌, సునీల్ క‌నుగోలు వంటి వారు కూడా ఆయ‌నంత‌టి వారు కావ‌డం. మ‌రీ ముఖ్యంగా  సునీల్ క‌నుగోలు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ని అదే ఊపులో తెలంగాణ లోనూ కొన‌సాగించి ఇక్క‌డా ఆ పార్టీని గెలిపించ‌డం వ‌ర‌కూ పీకే మానియా య‌ధేచ్చ‌గా న‌డిచింద‌నే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల టైంలో కేసీఆర్‌తో కూడా పీకే మంత‌నాలు జ‌ర‌ప‌డం సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు లేటెస్టుగా పీకే ఏమంటున్నాడంటే.. రేవంత్ బీహారీల‌ను తిట్టార‌నీ.. ఆయ‌న్ను ఎలాగైనా స‌రే ఈ సారికి ఓడించి ప్ర‌తీకారం తీర్చుకుంటానంటారు పీకే. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో అతి క‌ష్టం మీద గెలిచార‌నీ.. ఈసారికి ఆయ‌న్ను ఎలాగైనా స‌రే ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేశారు ప్ర‌శాంత్ కిషోర్.

ప్ర‌స్తుతం పీకే, ఆయ‌న టీములు వేరు వేరు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ని  నిండా ముంచింది పీకే కి చెందిన ఐప్యాక్ టీమే. ఊహించ‌ని విధంగా మ‌న సీట్ల సంఖ్య పెర‌గ‌బోతుంద‌ని ఊద‌ర‌గొట్టిన ఈ టీం అన్న‌ట్టుగానే జ‌గన్ కి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 11  సీట్లు వ‌చ్చాయి. దీంతో పీకే పెప్ అయిపోయింద‌న్న టాక్ స్ప్రెడ్ అయ్యింది.

అలాంటి పీకే ప్ర‌స్తుతం బీహార్ లో జ‌న్ సూర‌జ్ పార్టీ అని ఒక‌దాన్ని పెట్టి..  రాజ‌కీయ‌పు అడుగులు వేస్తున్నా రు. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌కీయ భ‌విత‌వ్యానికే దిక్కులేదు. ఆయ‌నొచ్చి ఇత‌రుల రాజ‌కీయ భ‌విత‌వ్యం అంతు  చూస్తామ‌న‌డ‌మేంటి? కింగ్ మేక‌ర్ పొజిష‌న్ నుంచి కింగులా మారుతామ‌న్న తాప‌త్రయం గ‌ల పీకే.. దానిపై మొద‌ట‌ ఫోక‌స్ పెట్ట‌కుండా ఇంకా పాత‌కాలపు స్ట్రాట‌జిస్టు గానే థింక్ చేస్తే ఎలా??? అన్న‌ది మరొక కామెంట్. ఫ‌స్ట్ మీర‌క్క‌డ కింగ‌వ్వండి సార్.. ఇత‌రులను బొంగు చేయ‌డం సంగ‌తి చూద్దాం అన్న‌ది ఆయ‌న‌కు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు విసురుతున్న స‌వాల్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu