TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద: గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు!

Published on: Fri Aug 28, 2026 10:38AM

భారత చెస్ రంగానికి ఇది నిజంగానే ఒక సువర్ణాక్షరాల ఘట్టం. తమిళనాడుకు చెందిన యంగ్ చెస్ సంచలనం, భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ వేదికపై దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ (Grand Chess Tour) ఫైనల్లో ప్రజ్ఞానంద అసాధారణ ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచాడు. ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడమే కాకుండా, గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ అద్భుత విజయం యావత్ చెస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగింది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్లేయర్ ఫాబియానో కారౌనాతో జరిగిన ఈ హోరాహోరీ పోరులో ఆరంభంలో ప్రజ్ఞానంద తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తొలి క్లాసికల్ గేమ్‌లో అమెరికన్ మాస్టర్ ఫాబియానో చేతిలో 6-0 తేడాతో ప్రజ్ఞానంద పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత జరిగిన రెండో క్లాసికల్ గేమ్ 3-3 పాయింట్లతో డ్రాగా ముగిసింది. ఫైనల్ ఆఖరి రోజు సమయానికి ఫాబియానో కారౌనా ఏకంగా 6 పాయింట్ల భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నాడు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా పోరాడటం ఏ క్రీడాకారుడికైనా ఒక అతిపెద్ద సవాలు.

అయితే, ప్రజ్ఞానందలోని అసలైన శాంపియన్ మనస్తత్వం ఆఖరి రోజు బయటపడింది. ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, 6 పాయింట్ల లోటుతో ఉన్న ప్రజ్ఞానంద ఊహించని రీతిలో పుంజుకున్నాడు. ర్యాపిడ్ గేమ్స్‌తో ఆట స్వరూపాన్నే మార్చేసి, ఫాబియానోపై వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్స్‌లో ఘన విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన బ్లిట్జ్ సెక్షన్‌లోనూ తన పదునైన వ్యూహాలతో, విద్యుత్ వేగంతో పావులు కదుపుతూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చివరికి 15-13 పాయింట్ల తేడాతో ఫాబియానోను మట్టికరిపించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 

 

first indian to win grand chess tour,praggnanandhaa vs fabiano caruana final.