ప్రభాస్ అనుష్కల నిశ్చితార్థం


 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రభాస్, అనుష్కల నిశ్చితార్థ వేడుకను చిత్రీకరిస్తున్నారు.రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 3కోట్ల బడ్జెట్ తో వేసిన సెట్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా లకు తల్లిగా రాజమాత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.