జగనన్న పంచెకట్టు, బొట్టు.. జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
posted on Feb 7, 2022 6:13PM
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయ వస్త్రదారణ తప్పనిసరి. ఇష్టం ఉన్నా లేకపోయినా.. డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. అందుకే, స్వతహాగా క్రిష్టియన్ అయిన జగన్‌రెడ్డి తిరుమల వెళితే పంచెకట్టుకున్నారు. తిరునామాలు కూడా పెట్టుకున్నారు. చూట్టానికి హిందువుగా కనిపించే ప్రయత్నం చేశారు. అంత వరకూ ఓకే. కానీ, డిక్లరేషన్ సంగతి మాత్రం మరిచారు. అది వేరే విషయం.
ఇక ఏపీలో ఉగాది వేడుకల సమయంలోనూ ఇలానే కనిపించారు జగనన్న. పంచెకట్టు, బొట్టుతో హిందూ సంప్రదాయ పద్దతిలో.. ఉగాది ఉత్సవాలకు హాజరయ్యారు. ఇది మాత్రం సంథింగ్ డిఫరెంట్. తిరుమలలో తప్పనిసరి కాబట్టి అలా కనిపించారు అనుకున్నా.. అవసరం లేకున్నా ఉగాదికి కూడా అలా హిందూ గెటప్ వేసుకోవడంపై అప్పట్లో చర్చ జరిగింది.
కట్ చేస్తే.. లేటెస్ట్‌గా హైదరాబాద్ ముచ్చింతల్‌లో శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు జగన్‌రెడ్డి. సమతామూర్తిని దర్శించుకున్నారు. ఈ సందర్భంలోనూ మళ్లీ అదే తెల్లని పంచెకట్టు. మోదీ బంగారు వర్ణం పట్టు వస్త్రాల్లో వస్తే.. జగన్ తెల్లటి పట్టు వస్త్రాల్లో కనిపించి.. మరోసారి హిందూ మెసేజ్ బలంగా చాటారు. అదే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మామూలు దుస్తుల్లోనే ముచ్చింతల్ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి, జగనన్నే ఎందుకు పదే పదే ఇలా పంచెకట్టులో కనిస్తున్నారు? తననూ హిందువుని ప్రజలు భావించాలని బలంగా కోరుకుంటున్నారా? హిందూ సమాజానికి ఆయనో మెసేజ్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానం రాకమానదు.
వైఎస్ కుటుంబమంతా వంద శాతం క్రిష్టియానిటీని పాటిస్తుంటుంది. తండ్రి వైఎస్సార్‌లానే జగన్‌రెడ్డి సైతం తరుచూ చర్చిలకు వెళుతుంటారు. ప్రార్థనలు చేస్తుంటారు. ఫాస్టర్ల ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు. ఇక జగన్ తల్లి విజయమ్మ అయితే బైబిల్ లేనిదే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టరు. చెల్లి షర్మిల భర్త, తన బావ అనిల్ కుమార్ అయితే ప్రముఖ మత ప్రబోధకుడు కూడా. సతీమణి భారతితో సహా.. జగన్ కుటుంబమంతా పక్కా క్రిష్టియన్లే.
అయితే, ఎన్నికల ముందు శారదా పీఠం స్వామిజీతో ఓ హిందూ తంతు నిర్వహించినట్టు వీడియోలు వదలడం.. తరుచూ శారదా పీఠం సందర్శించడం.. అవకాశం చిక్కినప్పుడల్లా.. తన క్రిష్టియానిటీకి హిందూ ముసుగు వేసుకోవడంలాంటి ప్రయత్నాలు జగన్‌రెడ్డి తరుచూ చేస్తుంటారని అంటారు. అందులో భాగమే ఇలా అవసరం ఉన్నా.. లేకున్నా.. పంచెకట్టు, బొట్టుతో హిందూ మెసేజ్ ఇస్తున్నారని చెబుతుంటారు.
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మాత మార్పిడిలు, ఆలయాలపై దాడులు, చర్చిలకు నిధులు పెరిగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ పత్రిక ది ఆర్గనైజర్‌లోనూ ఓ ఘాటైన కథనం ప్రచురితమైంది. జగన్ ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే విమర్శ ఉంది. అయితే, తనపై పక్కా క్రిష్టియన్ అనే ముద్ర పడటం రాజకీయంగా అంత మంచిది కాదని.. అధిక సంఖ్యాకులైన హిందువులను అక్కున చేర్చుకోవాలంటే.. తానూ వారి వాడినే అని నిరూపించుకోవడానికే.. కావాలనే ఇలా పంచెకట్టు గెటప్‌లో పదే పదే కనిపిస్తున్నారని అంటున్నారు.
అయితే, వైఎస్సార్ నిత్యం పంచెకట్టులోనే ఉండేవారు. ఆయనకు అది అలవాటు. కానీ, జగన్ మాత్రం ప్రత్యేకంగా హిందూ ఈవెంట్స్ సమయంలోనే ఇలా పంచెకట్టుకొచ్చి.. తెలుగు సంప్రదాయం పేరుతో హిందూ ప్రదర్శన చేస్తున్నారనే వర్షన్ వినిపిస్తోంది. ఇక, జగనన్నకు అర్థరాత్రి జీసస్‌తో, వైఎస్సార్‌తో మాట్లాడే అలవాటు ఉందని అంటుండగా.. మరి, ఇలా హిందూ లుక్‌ను ప్రదర్శించమనే సలహా వారే ఇచ్చారో? లేక, ఆ స్వామీజీ ఇచ్చారో? అంటున్నారు.