కర్నూల్ పర్యటనపై ప్రధాని స్పెషల్ ట్వీట్
posted on Oct 15, 2025 8:08PM
.webp)
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు కర్నూల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అచ్చమైన తెలుగులో ఈ ట్వీట్ పెట్టడం విశేషం.ఆంధ్రప్రదేశ్‌లో ‘రేపు(అక్టోబర్ 16)వ తేదీన పర్యటిస్తాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కాగా రేపు ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ విమానశ్రయం నుంచి బయల్దేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలంకు చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకొని అక్కడి విశేషాలు తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా నంద్యాల ఎస్సీ సునిల్ షెరాన్ ఆధ్వర్యంలో శ్రీశైలం మొత్తం గ్రేహౌండ్స్ పోలీస్ పార్టీలు శ్రీశైలం అడవులను జల్లెడ పట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దర్శనం అనంతరం కర్నూలుకు ప్రధాని చేరుకుని నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో 16 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.13,429 కోట్ల అంచనా వ్యయంతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిఎస్టి 2.0 సంస్కరణలు,వాటి ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వనున్నారు.