అన్నా... ఇది మ‌నూరు గాదే!

ఒక పెద్దాయ‌న హైద‌రాబాద్ నుంచి గుంటూరు వెళ్ల‌డానికి బ‌య‌లుదేరాడు. బ‌స్సు ఎక్కాడు. మాస్టారు రాత్రి హాయిగా నిద్ర‌పోయాడు. గుంటూరు దాటి రెండు స్టేజీల త‌ర్వాత ఎవ‌రో లేపితే లేచాడు. గుంటూ రా.. అని అడిగాడు.. అదిపోయి మూడు గంట‌ల‌యింది అన్నాడా వ్య‌క్తి. పెద్దాయ‌న ఖంగారుప‌డ్డారు. ఇది నిద్ర‌, కాస్తంత మ‌తిమ‌ర‌పు సంబంధిత క‌థ‌. కానీ బ‌స్సు కాబ‌ట్టీ స‌రిపోయింది. కానీ విమాన‌మ‌యితే ఏమ‌వుతుంది? ఊహించ‌డానికే భ‌య‌ప‌డ‌తాం. ఆ అనుభ‌వం భ‌యాన‌కం అంటున్నారు నేపాలీలు. ఎందుకంటే వారి విమానం వేరే ప‌ట్ట‌ణంలో దిగింది మ‌రి!

బుద్ధా ఎయిర్లైన్స్లో 69 మంది ప్ర‌యాణీకులు జ‌న‌క‌పురి నుంచి ఖాట్మండుకి వెళ్లేవారంతా ఆ విమానం ఎక్కారు. అంతా మ‌రో గంట‌లోనో రెండు గంట‌ల్లోనో చేరిపోతామ‌నుకున్నారు.  స‌ర‌దా మాట‌ల్లో ప‌డ్డారు. అప‌రిచితులు, ప‌రిచితులు అంతా మ‌ళ్లీ ప‌రిచ‌యాలు చేసుకున్నారు. ఎన్నో క‌బుర్లాడు కున్నారు. 63 మంది ప్ర‌యాణీకుల‌తో వెళ్తోన్న ఫ్ల‌యిట్ యు505 విమానం హ‌ఠాత్తుగా వారి గ‌మ్యానికి అవ‌త‌ల సుమారు 255 కిలోమీట‌ర్ల దూరంలోని పొఖారాలో దిగింది. హ‌మ్మ‌య్య మ‌న ఊరు వ‌చ్చేశామ‌ని అంతా దిగారు. కానీ అక్క‌డంతా కొత్త‌గా ఉంది. రోజూ చూసే తెలిసిన మొహాలు ఒక్క‌టీ లేవు. అంతా బ‌హుచిరాగ్గా చూస్తున్నా రు. ఏందిది.. మ‌నోడొక్క‌డూ అగ‌ప‌డ్డూ.. అనుకున్నారు ఓ పెద్దావిడ‌. 

అయితే మ‌నూళ్ల‌లో లాగా వాళ్ల‌మీద అమాంతం తిట్ల దండ‌కం చ‌ద‌వ‌లేదు. ఏమ‌యింది, ఇలా ఎందుకు జ‌రిగింద‌ని ఆమెతోపాటు అంద‌రూ ప్ర‌శ్నించారు. తీరా అస‌లు నిజం తెలిసి ఓకే అనేశారు. ఇంత‌కీ విష యమేమంటే.. అక్క‌డ హ‌ఠాత్తుగా వాతావ‌ర‌ణ మార్పు రావ‌డం, సిగ్న‌ల్స్ అంత‌గా అంద‌క‌పోవ‌డంతో ఇక్క‌డిదాకా తేవాల్సి వ‌చ్చింద‌ని అధికారులు చెప్పారు. గ‌ట్టిగా ప్ర‌శ్నిం చినందుకు సారీ.. ఆఫీస‌ర్స్ అనీ అన్నారు. త‌ర్వాత ఓ అర‌గంట‌కో, గంట‌కో మ‌రో తిరుగు విమానంలో వారిని వారి న‌గ‌రంలో దించారు. ఇదో అనుభూతి. ఒకే టిక్కెట్ మీద రెండూళ్లు తిరిగిన అనుభ‌వం.