హైదరాబాద్‌లో ‘పీకే’ ప్రచారం

 

అమీర్ ఖాన్, అనుష్క శర్మ కాంబినేషన్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘పీకే’ సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికే బోలెడంత ప్రచారం వచ్చేసింది. అయినప్పటికీ ఈ సినిమా టీమ్ ప్రచారం చేయడంలో వెనుకడుగు వేయడం లేదు. ‘పీకే’ సినిమా ఈనెల 19వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఈ సినిమా టీమ్ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కి వచ్చింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, రాజ్ కుమార్ హిరానీ, తదితరులు మాట్లాడుతూ ఈ సినిమా విశేషాలు చెప్పారు. ఈ సినిమా మొదటి ప్రకటనలో అమీర్ ఖాన్ ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా కీలకమైన ప్రదేశంలో ఒక ఓల్డ్ ట్రాన్సిస్టర్ మాత్రమే పెట్టుకుని కనిపిస్తాడు. ఆ ట్రాన్సిస్టర్ని త్వరలో వేలం వేయనున్నట్టు ఈ సినిమా యూనిట్ చెప్పింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu