తెలుగు సినిమాను వదలని పైరసీ భూతం
posted on Nov 24, 2025 9:04AM

తెలుగు సినీమాను పైరసీ భూతం వదల నంటోంది. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్టు చేసి.. అతడికి సంబంధించిన పైరసీ సైట్లను మూసేసిన సంగతి తెలిసిందే. అయితే అంతలోనే మీవీరూల్జ్ వైబ్ సైట్ పైరసీ సినిమాలతో రెచ్చిపోయింది. మూడు కొత్త సినిమాలు ప్రేమంటే, 12ఏ రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాయి గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు ఇలా విడుదలయ్యాయో లేదో, అలా గంటల వ్యవధిలో ఈ మూడు సినిమాల పైరసీలు మూవీరూల్జ్ లో ప్రత్యక్షమయ్యాయి. ఒ క్కరోజులోనే, సినిమాలు విడుదలైన గంటల వ్యవధిలోనూ ఆ సినిమాల ప్రింట్లు అప్ లోడ్ కావడం సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా, తీవ్ర ఆందోళనకు లోను చేసింది.
థియేటర్లలో ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే క్యాం కార్డర్‌తో రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోలని మూవీరూల్జ్ వెబ్ సైట్ అప్ లోడ్ చేసినట్లు గుర్తించారు. ఈ కమ్‌కామ్ ప్రింట్లు బయటకు రావడమే కాకుండా వేల సంఖ్యలో డౌన్‌లోడ్ అవు తుండటం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. పైరసీ కేసుల్లో కీలక పాత్రధారిగా ఉన్న ఐబొమ్మ రవి కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతున్న ఈ సమయంలో మూవీరూల్జ్ పైరసీ సినిమాలను ప్రసాదం చేసి సవాల్ విసరడం గమనార్హం.
టాలీవుడ్ సినిమాలు పైరసీ చేసి సినీ పరిశ్రమనే గడగడలాడించిన ఐబొమ్మ రవికి జనంలో హీరో రేంజ్ గుర్తింపు వచ్చంది. రవిని సామాన్య జనం, కొందరు సినీ జనం కూడా రాబిన్‌హుడ్‌తో పోలుస్తుండటం వెనుక సినీమా టికెట్ల ధరలు సామాన్యులు ధియోటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే భయపడే రేంజ్ లో ఉండటమే కారణమంటున్నారు. ఒకవైపు రవిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తుండగా మరోవైపు కొత్తగా మరో వెబ్ సైట్ మూవీరూల్జ్ విడుదలైన మూడు సినిమాలు గంటల వ్యవధిలోనూ ప్రసారం చేయడం గమనార్హం.