అక్కతో పాటు చెల్లి.. పెళ్లికొడుక్కి బంఫర్ ఆఫర్ 

సాధారణంగా ఒకటి కొంటే మరొకటి ఫ్రీ ఈ మాట దసరా, దీపావళి, సంక్రాంతి టైం లో వింటాం.. ఎగబడి కొంటాం.. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ పెళ్లి కొడుక్కి ఓకే వింత అనుభవం జరిగింది. అది ఏంటని అనుకుంటున్నారా మీరే చూడండి. 

అది కర్ణాటక.  వేగమడుగు గ్రామం నాగరాజప్ప, రాణెమ్మ దంపతులకు సుప్రియ, లలిత అనే  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఇద్దరిలోకి చిన్నదైన లలిత మూగ, చెవిటి అమ్మాయి. దాంతో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని కుటుంబ సభ్యులు బెంగపడేవారు. ఎప్పుడు ఆవేదన చెందుతుండేవాళ్లు. అయితే, ఇంతలో పెద్దమ్మాయి సుప్రియకు ఉమాపతి అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ నెల 7 తేదీన ఫిక్స్ అయింది.. పెళ్ళికి అందరు వచ్చారు. పెళ్ళిలో బాజాభజంత్రీలు మోగుతున్నాయి. బాహ్మణుడు మంత్రాలు వల్లిస్తున్నాడు. ఉమాపతి తాళి కట్టబోతుండగా, ఆపండి అని పాత సినిమాలో లాగ ఒక డైలాగు వినిపిచింది. ఒక సారిగా అందరు షాక్ అయ్యారు. ఆ మాట అన్నది ఎవరో అని కంగారు పడ్డారు. చివరికి ఆ మాట అన్నది పెళ్లి కూతురు సుప్రియ అన్నది. తనతో పాటు తన చెప్పిలి చేసుకోవాలని పట్టుపట్టింది. మూగ, చెవిటిదైన తన చెల్లెలి పరిస్థితి వివరించి, ఆమెను కూడా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటేనే తాను తాళి కట్టించుకుంటానని స్పష్టం చేసింది. లేకపోతే ఈ పెళ్లి జరగదని తెగేసి చెప్పింది. దాంతో పెళ్లి మంటపంలో కలకలం రేగింది. అయితే, అక్కడి పెద్దలు మానవతాదృక్పథంతో వ్యవహరించి ఉమాపతికి నచ్చచెప్పడంతో, ఆ యువకుడు అక్కాచెల్లెళ్ల ఇద్దరి మెడలో తాళికట్టాడు. కానీ, చివరికి అనూహ్యరీతిలో పోలీసులు రంగప్రవేశం చేసి, చిన్నదైన లలితకు ఇంకా మైనారిటీ తీరలేదంటూ కేసు నమోదు చేశారు.