హైదరాబాద్‌లో లారీ ఢీకొని ఇద్దరు మృతి
posted on Oct 12, 2025 3:50PM
.webp)
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు... నగరంలో ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో గ్రీన్ ల్యాండ్ నుండి బేగంపేట వైపు వెళ్తున్న ఇసుక లారీ వెనక నుండి ముందు వస్తున్న ఒక హోండా యాక్టి వా ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండ డంతో వెంటనే అతన్ని సోమాజి గూడ లో ఉన్న యశోద హాస్పిటల్ కి తరలించారు అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు నవీన్, జగదీష్ చంద్రగా పోలీసులు గుర్తించారు.
ఖమ్మం జిల్లా హవేలీ రూరల్ కు చెందిన ముద్దంగల్ నవీన్ (30) హైదరాబాద్ నగరానికి వచ్చి జేఎన్టీయూ పరిధిలో నివాసం ఉంటే రాపిడో డ్రైవర్గా పనిచేస్తు న్నాడు. అలాగే కరీంనగర్ జిల్లా ధర్మపురి కి చెందిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర (35) హైదరాబాదులోని బేగంపేట్ కుండన్ బాగ్ లో నివాసం ఉంటూ కిమ్స్_సన్ షైన్ హాస్పిటల్ లో జనరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్నాడు.
ఈ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న సమ యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద వైట్ హౌస్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పరిణ స్థలానికి చేరుకుని నాగూర్ కర్నూల్ జిల్లాకి చెందిన లారీ డ్రైవర్ శంకర(38) ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.