కేబీఆర్ పార్కుకి నిజాం పేరా? అదేంటి?

 

హైదరాబాద్ నగరంలోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుకు నిజాం పేరు పెట్టాలన్న ఆలోచన వుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నట్టుగా వార్తలు వచ్చారు. ఈ విషయాన్ని నిజాం వారసులు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్కుకు నిజాం పేరు పెట్టే నిర్ణయం విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. తెలంగాణ ప్రజలను చిత్రహింసలకు గురిచేసిన నిజాం పేరును పార్కుకు పెట్టడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం కోసం ఎంతోమంది నిజాం కారణంగా చనిపోయారని, నిరంకుశ నిజాం బలగాలు, రజాకార్లు ఎన్నో కుటుంబాలను బలిచేశాయని గుర్తు చేశారు. ముస్లింల మెప్పు కోసం కేబీఆర్ పార్కుకు నిజాం పేరు పెట్టాలనుకోవడం న్యాయం కాదని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu