ఓయు విద్యార్థుల రాస్తారోకో
posted on Dec 3, 2025 9:23AM
.webp)
ఉస్మానియా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వర్సిటీ హాస్టళ్లలో తిష్ఠ వేసిన సమస్యల పరిష్కారం కోసం వారు మంగళవారం (డిసెంబర్ 2) రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో వర్సిటీ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.
హాస్టళ్లలో శుభ్రతలేమి, తాగునీటి సమస్యలు, మరుగుదొడ్ల దుస్థితి, గదుల మరమ్మత్తుల విషయంలో వర్సీటీ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా హాస్టల్ లో ఆహారం నాణ్యత నాసిరకంగా ఉంటోందని ఆరోపించారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు విజ్ణప్తి చేసిన ఫలితం లేకపోయిందనీ, అధికారులు పట్టించుకోలేదనీ ఆరోపిస్తూ ఓయూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మౌలిక వసతులు కావాలి, నాణ్యమైన ఆహారం అందించాలి, వీసి డౌన్ డౌన్... పెరుగన్నం మీకు.... పురుగన్నమాకా అంటూని నాదాలు చేశారు.