కలవర పెడుతున్న ఒ మైక్రాన్ సబ్ వేరియంట్లు

కోవిడ్ 19 తగ్గిపోయిందని ఇక రాదని దాదాపు ప్రపంచమాన వాళి ఇక ఊపిరి పీల్చుకుంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఇటీవలే కొత్త సబ్ వేరియంట్స్ ను కనుగొన్నారు.బి ఏ 4,బి ఏ 5 సబ్ వేరియంట్స్ ఇతర దేశాలాలో విస్తరిస్తోంది. యు కే,యు ఎస్ లలో ప్రస్తుత పరిస్థితిని గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ అంశాల పై యుఎస్ యుకె నిపుణులు సాక్ష్యా ధరాలతో కూడిన అంశాల పై పరిశోదన జరుపు తున్నారు. వెస్టన్ కేప్ మెట్రో అత్యవసర సేవల విభాగం వ్యాక్సిన్ అంబు లెన్స్  వ్యా క్సినేషన్ ఈవెంట్ నిర్వహించారు.ఆల్ఫా,బీటా గామా డెల్టా ఒమేక్రాన్ వంటి వేరియంట్స్ ఒకటి తరువాత మరొక వేరియంట్స్ పుట్టుకోస్తు న్నాయి.

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  ఒమైక్రాన్ వేరియంట్స్ బి ఏ4,బి ఏ5 ఇటీవలే సౌత్ ఆఫ్రికా లో గుర్తించారు.సౌత్ ఆఫ్రికా ఇతరదేశాలలో కోవిడ్19. పరీక్షలు నిర్వహిస్తున్నారు. దక్షిణ ఆఫ్రికాలో పోజిటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.బిఏ4,బిఏ5 పూర్తిగా ప్రభావం చూపిస్తుంది.నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ క్లినికల్ డిసీజ్ దక్షిణ ఆఫ్రికాలో బిఏ 4,బిఏ 5 ఒమైక్రాన్ వైరస్ లు మ్యుటేట్ కావడాన్ని గమనించవచ్చు. శాస్త్రజ్ఞులు బిఏ 4,ను జనవరి 1౦-2౦ 22 న కనుగొన్నారు.సౌత్ ఆఫ్రికాలో విస్తరించిన విషయాన్ని గమనించారు అందులో నిర్వహించిన పరీక్షలలో ౩5%  పోజిటివ్ కాగా బిఏ 5ఫిబ్రవరిలో 2౦%కేసులు దక్షణ ఆఫ్రికాలో గుర్తించారు.

స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్...

పైన పేర్కొన్న ఒమైక్రాన్ బి ఏ2 యు కే లో తీవ్ర ప్రభావం చూపుతోంది.కాంటినెంటల్ యురప్ ,యుఎస్ లో విస్తరిస్తున్నట్లు సమాచారం.బి ఏ4,బి ఏ5 మ్యుటేట్ కావడాన్ని గుర్తించారు.ఇతర ప్రాంతాలలో సైతం వైరస్ మార్పు చెందడాన్ని గమనించవచ్చు. కోవిడ్19 వేరియంట్స్ లో సబ్ వేరియంట్స్ రూపాంతరం చెందుతూ కనిపిచడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. కొత్త కొత్త వేరియంట్స్ గా మారడాన్ని శాస్త్రజ్ఞులు గమ నించారు.వీటిని డ్రిఫ్ట్ వేరియంట్స్ ఒకే కుటుంబానికి చెందినవి గా భావించ వచ్చు. 

వేరియంట్స్ ఎక్కడ ఉన్నాయి...

ఇప్పటికే బిఏ4 ,బిఏ5,వేరియంట్స్ చాలా దేశాలలో గుర్తించారు.యు కే హెల్త్ సెక్యూరిటీ సంస్థ ఏప్రిల్ 22 నాటికి బిఏ4 ఆస్ట్రియా,యుకే, యుఎస్,డెన్మార్క్,బెల్జియం,ఇజ్రాయిల్,జర్మనీ,ఇటలి,కెనడ, ఫ్రాన్స్,నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా,స్విట్జర్ల్యాండ్,బోట్స్వానా,లో విస్తరిస్తోందని నిపుణులు పేర్కొన్నారు.
బిఏ5 పోర్చుగల్, జర్మనీ,యుకే,యు ఎస్,డెన్మార్క్,ఫ్రాన్స్,ఆస్ట్రేలియా,బెల్జియం హాంగ్ కాంగ్ ఆస్ట్రేలియా, కెనడా,ఇస్తాంబుల్,నార్వే పాకిస్తాన్,స్పెయిన్,స్విట్జర్ ల్యాండ్,పోజిటివ్ పరీక్షలలో డబ్ల్యు హెచ్ఓ మే 4 నాటికి తీవ్రంగా మారడం పట్ల డబ్ల్యు హెచ్ ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.చాలా దేశాలలో వైరస్ వస్తుందా లేదా వచ్చినా కంటికి కనబడ కుండా తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తుంది.వైరస్ మ్యుటేట్ కావడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆతరువాత ఏ వైరస్ వస్తుందో అంచనా వేయడం కష్టసాధ్యంగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మే12 నాటికి యురప్,సిడిసి వివరాల ప్రకారం బిఏ4 బిఏ5 వేరియంట్లు గురించి మాట్లాడుతూ పోర్చుగల్ లో కోవిడ్ పెరగడం పై పోర్చ్గుగీస్ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది.మే 8 నాటికి బిఏ5 ౩7%కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.బిఏ4,బిఏ5 త్వరగా వ్యాప్తి చెందుతుందని సి డి సి వెల్లడించింది. ఇటీవల భారత్ లో కేసుల సంఖ్య గణనీయం గా పెరగక పోయినా బిఏ4 బిఏ5 త్వరా విస్తరిస్తున్నకారణం గా అప్రమత్తం గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తునారు.