బండి బగీరథ్ కు హైకోర్టులో చుక్కెదురు

posted on: May 16, 2026 9:18AM

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది.  భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో దనలు సుదీర్ఘంగా సాగాయి.  భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపి  నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.  

ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు  తెలిపింది.  ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.  

అదలా ఉంటే.. తన కుమారుడిపై పోస్కో కేసుకు సంబంధించి  తన పేరును ముడిపెడుతూ సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను వెంటనే తొలగించాలని కోరుతూ బండి సంజయ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు బండి సంజయ్ పేరును ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను తక్షణమే తొలగించాలని   మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బండి బగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును  ఎక్కడా ప్రస్తావించరాదని స్పష్టం చేసింది.  భవిష్యత్తులో కూడా ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ పేరుతో ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని, ప్రచురించరాదని కోర్టు  ఆదేశించింది.  

కాగా బండి సంజయ్ తన కుమారుడు బండి బగీరథ్ ను విచారణకు పంపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.   కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్  హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు తానుగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా తన కొడుకును విచారణకు అప్పగించి, చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొనేలా చేయాలని సీఎం అన్నారు. బండి సంజయ్ కింది స్థాయి నుంచి స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగారనీ, ఇప్పుడు కుమారుడి కారణంగా తలవంపులు ఎదుర్కొంటున్నారనీ సీఎం అన్నారు.  ఏది ఏమైనా విచారణను ఎదుర్కోకుండా బండి  భగీరథ్ పారిపోవడంసరికాదన్నారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలనీ, అలా చేస్తే..  అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందన్న రేవంత్ రెడ్డి.. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...