కుక్కను పట్టుకోండి.. లక్ష పట్టుకోండి.. 

ఆలస్యం చేయకండి  బాబు ఆలోచిస్తే ఆశ భంగం. మంచి తరుణం మించిన దొరకదు. కుక్కను పట్టుకోండి. రూ లక్ష కొల్లగొట్టండి. అది అలాంటిలాంటి కుక్క కాదు బాబు సాక్షాత్తు హీరోయిన్ కుక్క. ఆ కుక్క అంటే ఆమెకు ప్రాణం అందుకే ఈ బంఫర్ ఆఫర్. అదేంటి కుక్క పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తారా అని అనుకుంటున్నారా..? నేను చెప్పింది నిజం. మీరు విన్నది నిజం. అదేంటో మీరే చూడండి.. 

హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తాజాగా ఓ పోస్ట్ చేస్తూ త‌మ కుక్క త‌ప్పిపోయింద‌ని, దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.ల‌క్ష ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ కుక్క ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు ఫోను చేయాల్సిన నంబ‌రును ఆమె పోస్ట్ చేసింది. కుక్క ఆచూకీ చెబితే ఏకంగా ల‌క్ష రూపాయ‌లు ఇస్తామ‌ని ఆమె చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది. పూరీ జ‌గ‌న్నాథ్‌-రామ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో న‌టించి మెప్పించిన‌ నిధి అగ‌ర్వాల్ కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

టాలీవుడ్‌లోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. త‌మిళంలో ఆమె న‌టించిన‌ రెండు సినిమాలు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆమె చేతిలో గల్లా అశోక్ హీరోగా న‌టిస్తోన్న సినిమాతో పాటు, పవన్ కల్యాణ్ న‌టిస్తోన్న 'హరి హర వీర మల్లు' సినిమా కూడా ఉంది.