కేరళ సర్కార్ కు కొత్త చిక్కులు!

 దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్ట్  ప్రభుత్వం .. కేరళ ప్రభుత్వం. గత సంవత్సరం (2021) ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అనూహ్యంగా, ఆనవాయితీకి భిన్నంగా వరసగా రెండవసారి, వామపక్ష ప్రజాసామ్య కూటమి ( ఎల్డీఎఫ్) అధికారంలోకి వచ్చింది. సహజంగా, కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ( ఐక్య ప్రజాస్వామ్య కూటమి) వంతుల వారీగా అధికారంలోకి రావడం ఆనవాయతీగా వస్తోంది. అయితే. 2021 ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఎల్డీఎఫ్ వరసగా రెండసారి అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీ కూడా తెచ్చుకుంది.   వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ సారధ్యంలో కొవిడ్ కట్టడికి తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే ముఖ్యమంత్రి వివిజయన్ ఆమెను మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోలేదనుకొండి అది వేరే విషయం. 

అయితే, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలను ఎదుర్కుంటోంది. అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటోంది, వరస చిక్కుల్లో చిక్కుకుంది. ఎన్నికలకు ముందునుంచే ఎల్డీఎఫ్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్న, బంగారం కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతూ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంటోంది. 2020 జూలై 5వ తేదీన త్రివేండ్రం విమానాశ్రయంలో 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న సంఘనటతో మొదలైన, బంగారం కుంభకోణం కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్, విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల కుంభకోణం ముఖ్యమంత్రి  కార్యాలయం కనుసన్నల్లోనే జరిగిందని ఆమె ఆరోపించారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది,ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుంది, ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే భయం ఎల్డీఎఫ్ ప్రభుత్వాని వెంటాడుతోంది. 

అదలా ఉంటే, కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్  కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నారు.  రాజ్యాంగాన్ని దూషించి, చిక్కుల్లో చిక్కుకున్నారు. రాజ్యాంగాన్ని తూలనడుతూ, సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రచించారని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సర్కార్ కు తలవంపులు తెచ్చాయి. అలా  విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న ఆయన చివరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అయితే  సాజీ చెరియన్ ఇంకా ఇప్పటికీ తమ వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని.. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని, అంటున్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదనే.. కోణంలో తాను మాట్లాడనన్నారు. తనకు రాజ్యాంగం అంటే అత్యంత గౌరవమని అన్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని చెరియన్‌ అన్నారు.. అయినా అప్పటికే జరగవలసిన నస్టం జరిగిపోయింది. సాజీ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కాక రేపాయి. కేరళ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. వెంటనే సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాండ్ చేశారు. 

సో.. ముందు కొంత బుకాయించినా చివరకు చేసేది లేక  స్వయంగా ముఖ్యమత్రి కార్యాలయానికి వెళ్లి రాజీనామా సంర్పించారు. అయితే, తన రాజీనామా తన స్వతంత్ర నిర్ణయమని సాజీ చెరియన్ అన్నారు. ఇప్పటికే  బంగారం కుంభకోణం, లైవ్ మిషన్ అవినీతి కుంభకోణం, పెరుగతున్న లవ్ జిహాదీ కేసులు, శాంతి భద్రతల పరిస్థితి, వయాలర్ ఎంపీ రాహుల్ గాంధీ, కార్యాలయంపై ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు జరిపిన దాడి.. ఒకదాని వెంట ఒకటిగా వెంటాడుతున్నసమస్యలతో సతమతమవుతున్న ముఖ్యమత్రి, ప్రతిపక్ష పార్టీలకు మరో అస్త్రం ఇవ్వడం ఇష్ట లేక మంత్రి సాజీని రాజీనామా కోరినట్లు అధికార వర్గాల సమాచారం. అయన అడిగారా, ఈయన ఇచ్చారా, అనేది పక్కన పెడితే. మంత్రి రాజీనామా చేశారు.  లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుయ్వానికి మచ్చ మిగిలింది.