తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు
posted on Feb 2, 2022 1:03PM
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు అపాయింట్ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజయం ఫిబ్రవరి 1న సమావేశమై ఈ మేరకు ఏడుగురు న్యాయవాదులను జడ్జీలుగా నియమిస్తూ సిఫార్సు చేసింది. వారిలో 1) కాసోజు సురేందర్, 2) చాడా విజయభాస్కర్ రెడ్డి, 3) సూరేపల్లి నందా, 4) ముమ్మినేని సుధీర్ కుమార్, 5) జువ్వాడి శ్రీదేవి, 6) మీర్జా షఫీ ఉల్లా బేగ్, 7) నాచరాజు శ్రావణ్ కుమార్ వెంకట్ ఉన్నారు.
ఇక మరో ఐదుగురిని జ్యుడీషియల్ ఆఫీసర్లుగా నియమిస్తూ సిఫార్సు చేసింది. వారిలో 1) అనుపమా చక్రవర్తి, 2) ఎంజీ ప్రియదర్శిని, 3) సాంబశివరావు నాయుడు, 4) ఎ. సంతోష్ రెడ్డి, 5) డి.నాగార్జున్ ఉన్నారు. ఈ నియామకాలతో కోర్టు వ్యవహారాలు మరింత సజావుగా, వేగంగా జరిగే అవకాశం ఉంది.