నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా
posted on Oct 22, 2025 3:27PM

ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన పిప్పింగ్ సెర్మనీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా 2016లో సుబేదార్‌గా సైన్యంలో చేరారు. అనంతరం 2021లో మేజర్‌గా పదోన్నతి పొందగా, 2022లో ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్రం ఆయనను సత్కరించింది. ఇప్పుడు మేజర్ నుంచి లెఫ్టినెంట్ కల్నల్‌గా మరింత ఉన్నత హోదా అందుకున్నారు.
అథ్లెటిక్స్‌లో అసాధారణ విజయాలు సాధించి, లక్షలాది యువతను ప్రేరేపించిన సేవలకు గుర్తింపుగా నీరజ్ చోప్రాకు ఈ అరుదైన గౌరవం దక్కింది.
భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాన్ని 2021లో అందుకున్న నీరజ్ చోప్రా.. 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
భారత దేశానికి కీర్తి తెచ్చిన ప్రముఖ క్రీడాకారుల సరసన ఇప్పుడు నీరజ్ చోప్రా కూడా చేరాడు. గతంలో మిల్కా సింగ్, పీ.టీ. ఉషా, ధ్యాన్‌చంద్, సీ.కే. నాయుడు, గుర్మీత్ సింగ్‌లకు కూడా లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది.