దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపు
posted on May 9, 2025 5:14PM
.webp)
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ద పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో అన్ని పోర్టులు, నౌకాశ్రయాలు, టెర్మినళ్లు వద్ద భద్రతను కట్టదిట్టం చేసింది. రెండో లేవల్‌కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని షిప్పంక్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.దేశంలోని కొన్ని ఎయిర్‌పోర్టులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 138 విమానాలను రద్దు చేసినట్టు సమాచారం. రద్దు చేసిన విమానాల్లో 4 ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే ఇంటర్నేషనల్ విమానాలు, 5 ఢిల్లీ నుండి వెళ్లే ఇంటర్నేషనల్ విమానాలు, 63 ఢిల్లీకి వచ్చే డొమెస్టిక్ విమానాలు, 66 ఢిల్లీ నుండి వెళ్లే డొమెస్టిక్ విమానాలు ఉన్నాయి. దీంతో కేవలం కొన్ని విమానాలు మాత్రమే రద్దు చేశామని విమానాశ్రయం తెరిచి ఉంటుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ విభాగం పేర్కొంది. మిగితా విమానాలు యతావిథిగా నడుస్తాయని స్పష్టం చేసింది.