పద్దతి మార్చుకో... జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న జాతీయ, అంతర్జాతీయ పత్రికలు!

మూడు రాజధానుల నిర్ణయం పరాకాష్ఠను అందుకుందని తమ సంపాదకీయాలలో ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పై ఆందోళనను తెలియజేశాయి జాతీయ మీడియా సంస్థలు. బ్లూమ్ బర్గ్ వంటి అమెరికా పత్రికలు సైతం విద్యుత్ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తోందని విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ.. ఆయన ఐదేళ్ళలో తల పెట్టిన ప్రాజెక్టులను నిర్ణయాలను పూర్తి చేయటం రాష్ట్రానికే కాదు దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుందని ముక్త కంఠంతో వినిపించాయి. ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి నుండి నేర్చుకోండి అంటూ ముక్తాయించారు. 

మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదని అన్నారు ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా. భారతదేశానికి అమరావతి వంటి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అవసరమని తెలిపారు. అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమన్నారు సహసంపాదకులు సచ్చిదానందమూర్తి. తెలుగు నాడును ఇంగ్లీషు నాడుగా మారుస్తున్నారని.. జగన్ సర్కారు పాలనలో రద్దుల వర్గమే కొనసాగుతోందన్నారు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులను ఉపయోగించుకొని శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయడం పూర్తిగా అనవసరమంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. ఈ ఘర్షణాయుత రాజకీయాల వల్ల రాష్ట్రం దెబ్బ తింటుందని.. కక్ష సాధింపే జగన్ ప్రధాన దృష్టిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. చంద్రబాబు మేధో జనితమైన అమరావతి ఇప్పుడు దెయ్యాల నగరంగా మారే ప్రమాదం ఉందన్నారు. జగన్ అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలే అమలు చేస్తే ఖజానా గుల్లవుతుందని వెల్లడించింది. చంద్రబాబుతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలనుకున్న అసంపూర్ణ కలను జగన్ నెరవేర్చారని సూచించింది. తరచు విధాన నిర్ణయాలు మార్చటం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బ తింటుందని.. అదే పత్రిక మరో కథనాన్ని రాసింది. అమరావతి ప్రాజెక్టు విజయవంతమైతే దేశ వ్యాప్తంగా నగరాల నిర్మాణానికి రైతులు ముందుకొచ్చేందుకు దోహదం కలుగుతుందని.. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని జగన్ కు సూచించింది. అమరావతి నిర్మాణాలను అసంపూర్తిగా మిగల్చరాదని దేశ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. చంద్రబాబు వారసత్వాన్ని జగన్ చెరిపేసే బదులు సుపరిపాలన అజెండాను అమలు చేయాలని ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాన్ని రాసింది. 

విద్యుత్ ప్రాజెక్టుల రద్దు, పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, అమరావతిలో నిర్మాణాలను 100 రోజుల్లోనే నిలిపివేయటం దారుణమంటూ వ్యాఖ్యానించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వెనక్కు వెళ్లడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మంచి పరిణామం కాదని తెలియజేసింది. అమరావతి ఆలోచనను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్ ఉద్దేశ్యమైతే అది అసమర్థ నిర్ణయమవుతుందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. మూడు రాజధానుల మధ్య వందలాది కిలోమీటర్ల దూరం ఉంది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు దుర్భరంగా మారుతాయని పేర్కొంది.ఇలా జగన్ చేసే పనులు పై ఇప్పటికే అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సూచీలో దేశం ఎంతో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించింది. నియంతృత్వ పోకడలు పెట్టడం మానుకోవాలని  పత్రికలు సూచిస్తున్నాయి. రాజకీయ కారణాలతో అమరావతి ప్రాజెక్టు పై సీతకన్ను వేయటం సరైంది కాదని తన సంపాదకీయంలో రాసుకొచ్చింది. హిందుస్థాన్ టైమ్స్ భారీ ఎత్తున ప్రజాధనం వృధా చేస్తున్నందున అందుకు జగన్ బాధ్యత వహించాలని.. అమరావతి కోసం సేకరించిన భూమి ఏమవుతుందో చెప్పాలని కథనంలో పేర్కొంది. తన వ్యక్తిగత ఆకాంక్షల కోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీయరాదని సూచించింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఆంగ్ల పత్రికల సంపాదకీయాలు జగన్ పాలన పై వీలు దొరికినప్పుడల్లా ధ్వజమెత్తుతూనే ఉన్నాయి.8 నెలల క్రితం అధికారంలోకి వచ్చి తొలి అడుగుగా ప్రజావేదికల కూల్చిన నాటి నుంచి తాజాగా రాజధాని మార్పు దాకా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న ప్రతి చర్య వాటి కన్నెర్రకు గురవుతూనే ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రతి పత్రిక , అన్ని మాధ్యమాలు తప్పుబడుతూనే ఉన్నాయి.  మరి సీఎం తన వైఖరిని ఎంత మేరకు మార్చుకుంటారో లేక తన పంతానికి ప్రజలను ఇబ్బందుల్లోకి నెడతారో వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu