గోవా తీరంలో ప్రధాని దీపావళి వేడుకలు
posted on Oct 20, 2025 4:36PM
.webp)
గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్‌లో చోటు లేదని ప్రధాని అన్నారు. మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని వెల్లడించారు. వారి ఏరివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఈ ఏడాది మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100కి పైగా జిల్లాలు ఆనందంగా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటాయని పేర్కొన్నారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. వారి హిట్టుకు ప్రతిస్పందిస్తూ ‘ఆపరేషన్ కగార్’ను ప్రారంభించామని పేర్కొన్నారు. భద్రతా దళాల ధైర్యం కారణంగా దేశం ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది. 11 సంవత్సరాల క్రితం నక్సల్స్ 125 జిల్లాల్లో విస్తరించగా, ఇప్పుడు కేవలం 3 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యారు.
మావోయిస్టుల రహితంగా దేశాన్ని మార్చడం మా లక్ష్యం. 100 కంటే ఎక్కువ జిల్లాల ప్రజలు మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తి పొందగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వేలాది మంది మావోయిస్టులు సమాజంలో మిళితమై జనజీవనంలో భాగమవుతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కనీస సౌకర్యాలు లేకుండా పరిస్థితిని నష్టపరిచారు. పాఠశాలలు, ఆసుపత్రులను ధ్వంసం చేసి, వైద్యులను హత్య చేసిన సంఘటనలు కూడా. ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.
కొత్త పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పడుతూ చిన్నారులు కొత్త భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఈ విజయం మొత్తం భద్రతా దళాల కృషి ఫలితం. దేశంలోని అనేక జిల్లాల్లో ప్రజలు దీపావళిని తొలిసారిగా గర్వంగా, గౌరవంగా జరుపుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మోదీ పేర్కొన్నారు.