టీటీడీ పరకామణిలో రూ.100 కోట్ల చోరీ : భాను ప్రకాష్ రెడ్డి
posted on Sep 20, 2025 6:08PM

తిరుమలలోని పరకామణిలో అవకతవకలపై టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.100కోట్లకు పైగా చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ కేసును సీఐడీ విచారణకు హైకోర్టు అప్పగించిందని.. నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించిందని తెలిపారు.
ఆ రోజు అధికారంలో ఉన్న కొందరు వైసీపీ నాయకులకు ఇందులో వాటాలు వెళ్లాయి భాను ప్రకాష్ పేర్కొన్నారు. రూ.112 కోట్లు చోరీ జరిగితే కేవలం 9 నోట్లు మాత్రమే సీజ్ చేసినట్లు చూపించారు. ఈ కేసు పునఃవిచారణ చేయాలని డీజీపీకి విన్నవించమని ఇచ్చామని తెలిపారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు స్వామివారి పేరుతో రూ.40 కోట్ల ఆస్తులను రాయించుకున్నారని ఆయన ఆరోపించారు.