తాజా ఉద్య‌మం మై హ్యాండ్లూమ్.. మై ఫ్రెండ్

తెలుపు శాంతికి చిహ్నం.. ఖ‌ద్ద‌రు సామాన్య జీవ‌నానికి చిహ్నం.. అందుకే గాంధీగారు రెంటినీ పాటించా ల‌ని రాజ‌కీయ‌నాయ‌కుల‌కు బోధించారు. తెలుపు మాట ఎలా ఉన్నా ఖ‌ద్ద‌రు మాత్రం కాలంతో పాటు టెర్లీన్ లోకి మారి రాజ‌కీయ‌నాయ‌కుల‌కు అనుకూల‌మ‌యింది. ఇంకా ఇప్ప‌టికీ  ఖ‌ద్ద‌రునే వాడే నాయ కులూ ఉన్నారు.  కాగా ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య విచిత్ర పోటీ జ‌రుగుతోంది. నేనో మొక్క‌ నాటాను అంటే మ‌రో నాయ‌కుడు రెండు మొక్క‌లు నాటాన‌ని వీడియో పెడుతున్నారు. ఇపుడు దుస్తుల విష‌యం లోనూ పోటీ పెట్టుకున్నారు. నేను చేనేత‌కు పెద్ద అంబాసిడ‌ర్‌ని అంటూ జ‌న‌సేన నాయకుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించుకున్నాడు. అంతే వెంట‌నే  చాలామంది నువ్వే కాదు చాలామంది అదే బాట‌లో ఉన్నార‌ని ప్ర‌క‌టించారు.  

వీరికంటే ముందే  మై హ్యాండ్లూమ్ మై ఫ్రెండ్ అంటూ నారాయ‌ణ పేట్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న సోష‌ల్ మీడి యాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ప్ర‌జ‌లు చేనేత‌ను ఎక్కువ ఉప‌యోగించాల‌న్న‌ది ఆమె ప్ర‌చార సారాం శం. ఆ మాట అందుకున్నారు సీనియ‌ర్ ఐ ఏ ఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్. అం దుకు కొన‌సా గింపుగా మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌, ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌ను ట్యాగ్ చేశారు. 

ఈ త‌ర‌హా చాలెంజ్‌లు ఆరోగ్య‌క‌ర‌మే. ఇందులో చేనేత‌కార్మికుల‌ను ప్రోత్సహించాల‌న్న ల‌క్ష్య‌మే క‌న‌ప‌డు తోంది. క్ర‌మేపీ పోలీసు రంగానికీ పాకింది. హైద‌రాబాద్ సీపీ సీవి ఆనంద్‌ను పోచంప‌ల్లి దుస్తులు వేసుకు ని ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు స్పందించారు ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్, ప్ర‌స్తుత కామ‌న్ వెల్త్ గేమ్స్‌లో స్వ‌ర్ణం సాధించిన పి.వీ.సింధు.  చాలా చిత్రంగా ఉంది.. దుస్తులు ఏవి, ఎలాంటి వేసుకోవాల న్నదీ మోడ‌ల్స్‌లా పోటీప‌డి మ‌రీ ధ‌రించ‌డం, ప్ర‌చారం చేయ‌డం. ఒక విధంగా చేనేత రంగానికి ఇదో పెద్ద ప్ర‌చారం. ప్ర‌త్యే కించి చేనేత రంగంవారు మీడియాలో ప్ర‌చారం చేసుకోన‌క్క‌ర్లేదు. ఎవ‌రో ఒక సెల‌బ్రెటీతో నాలుగు మంచి మాట‌లు చెప్పించి ఈ దుస్తులు ధ‌రించితే చాలు. అది అలా ఆసేతు హిమాచ‌లం ఫాలో అయిపోతు న్నారు. 

గ‌తంలో ప‌చ్చ‌ద‌నం ఆరోగ్య‌క‌రం అనే టాగ్‌తో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కోసం ప్ర‌జ‌ల‌కు మొక్క‌లు నాట‌డం, చెట్ల‌ను ప‌రిర‌క్షించ‌డం, చెరువులు, న‌దుల‌ను ర‌క్షించుకోవాల‌న్న‌ల‌క్ష్యంతో ప‌ర్యావ‌ర‌ణ శాఖ భారీ ప్ర‌చా రాలే చేసింది.  అందుకు చాలామంది స్పందించారు. అన్ని ప్రాంతాల్లోనూ సెల‌బ్రిటీలు ముందుకు వ‌చ్చి ఎంతో ప్రోత్స‌హించారు. ఇదో ఆరోగ్య‌క‌ర పోటీత‌త్వాన్ని పెంచింది. ఇది క్ర‌మేపీ అన్ని రంగాల‌కూ విస్త‌రిస్తే మ‌రింత బాగుంటుంది.