మోడల్‌కి తప్పతాగించి దోచుకున్నాడు???

 

ముంబైకి చెందిన సుబ్రతా దత్తా అనే యువ మోడల్ మోడలింగ్ ద్వారా ముంబైలో బాగానే డబ్బు సంపాదించింది. ఆమెకి సినిమా హీరోయిన్ అవ్వాలనేది కోరిక. మొదట తెలుగు సినిమా రంగం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవ్వాలని ఆశపడింది. ఆ ఆశను క్యాష్ చేసుకోవాలని ఒక మోసగాడు ఆలోచించాడు. నెట్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఆ మోసగాడి పేరు రాజు. సికింద్రాబాద్‌ వాస్తవ్యుడు. తెలుగు సినిమాల్లో ప్రముఖ హీరోల సరసన హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని సుబ్రతా దత్తాని రాజు నమ్మించాడు. రాజు మాటలు నమ్మిన సుబ్రతా దత్తా హైదరాబాద్‌కి వచ్చింది. రాజు ఆమెని సికింద్రాబాద్ ప్రాంతంలో వున్న తన ఇంటికి తీసుకెళ్ళాడు. రెండు రోజుల పాటు ఆమె చేత బాగా తాగించాడు. గురువారంనాడు బ్యూటీ పార్లర్‌కు తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తుండగా కారులోనే ఆమెకి మత్తు కలిపిన మద్యం ఇచ్చాడు. అది తాగి ఆమె స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను చక్కగా ఒలుచుకుని రాజు ఆమెను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలేసి పోయాడు. కొద్ది గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన మోసాన్ని తెలుసుకుని అతనిపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజు కోసం వెతుకుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu