అమ్మ‌లూ.. రాఖీ స‌రే.. ఓటు మాటేమిటి?

గ‌త రెండు రోజులుగాదేశంలో రాఖీ హ‌డావుడి జ‌రుగుతోంది. ఉత్త‌రాదిలో ఇప్ప‌టికే రంగు రంగుల బ్యాండ్లతో, చిన్న‌క‌వ‌ర్లో ఓ వంద నోటుతోనో చెల్లెళ్ల ఇంటికి ప‌య‌న‌మ‌వుతున్నారు. కానీ చిత్రంగా ఇది ఇటీవ‌ల మ‌రీ రాజ కీయంగానూ మారిపోయింది. ఇంట్లో చూపించేది నిజంగానే అన్నాచెల్లెళ్ల ప్రేమ బ‌య‌టికి వ‌స్తే స‌ద‌రు చెల్ల‌లో, అక్కో ఖ‌చ్చితంగా ఓట‌రుగానే చెల్లుబాటు అవుతోన్నారు. 

అన్నా..నీ అనురాగం ఏన్నో జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం.. అంటూ ఓ పాత సినిమాలు ఓచెల్లి ఇల్లంతా తిరుగుతూ హీరోగారికి చెల్లి ప్రేమ పంచుతుంది. అప్ప‌ట్లో ఈపాట‌కు అమాంతం వెన‌క‌వ‌ర‌స‌ల్లో ఉన్నవారు క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు. ప‌రుగున చెల్లెళ్ల ఇంటికి ప‌రుగులు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు, స‌ర్వసాధార‌ణం. కాగా, ఎన్నిక‌ల స‌మ‌యంలో దాదాపు అన్ని పార్టీల‌వారు అక్క‌చెల్లెళ్ల‌ను క‌ల‌వాల‌ని భార్యా స‌మేతంగా ఏకం గా కుం కుమ‌ భ‌రిణితో అన్నిఅపార్ట్‌మెంట్ల‌కీ తిర‌గ‌డం ఆన‌వాయితీగానూ మారిపోయింది. రాజ‌కీయ నాయ కుల ప్రేమలో కొంత స్వార్ధం ఉంటుంది. వారు ఎంత ప్ర‌చారం చేసుకున్నా స‌ద‌రు అక్క‌చెల్లెళ్లు చివ‌రాఖ రికి ఓట‌ర్లుగా మారిపోతారు. ప్ర‌ధాని మోదీజీ కూడా ఈ చెల్లెళ్ల ప్రేమ‌ను ఉప్పొంగించాల‌ని చాలా ఆతృతే  ప్ర‌దర్శించారు. 

ఇటీవ‌ల కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో నిజానికి ఎంతో అద్భుతంగా డాక్ట‌ర్ల‌తో స‌మానంగా ప‌నిచేసింది  పారిశుద్ధ్య కార్మికులే. ఇందులో సందేహం లేదు. వారికి దేశ‌ప్ర‌జ‌లంతా అపార గౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శించారు. కాగా ఇపుడు లేటెస్టుగా ప్ర‌ధాని ర‌క్షాబంధ‌న్ అడ్డంపెట్టుకుని మంగ‌ళ‌వారం (ఆగ‌ష్టు 10) ఢిల్లీలో  ప్ర‌ధాని త‌న కార్యాల‌యంలో ప‌నిచేస్తున్నపారిశుధ్య కార్మికుల పిల్ల‌ల్ని పిలిపించి వారితో రాఖీ క‌ట్టించుకున్నారు. ఆ వ‌చ్చిన పిల్ల‌లు త‌ల్లుల‌తో పాటు ఎంతో మురిసిపోయారు. కానీ విప‌క్షాలు మాత్రం ఇదంగా రాజ‌కీయ జిమ్మిక్కుగానే వ‌ర్ణిస్తున్నారు. న‌రేంద్ర‌మోదీ వంటి రాజ‌కీయ చ‌తురుడు, ఎత్తులు, పై ఎత్తులు వేయ‌డంలో ఆరితేరిన‌వారూ బీజేపీలో ఎవ్వ‌రూ లేరు. ఆయ‌న‌కు ఏ స‌మ‌యంలో ఎవ‌రిని ఆక‌ట్టుకోవాల‌న్న‌ది బాగా ఎరుకే. 

ర‌క్షాబంధ‌న్ మాత్ర‌మే కాదు అజాదీ కా అమృతోత్స‌వ్ పాఠాన్ని దేశ ప్ర‌జ‌లంద‌రికీ వినిపించి దేశ భ‌క్తిని ప్ర‌తీవారు ప్ర‌ద‌ర్శించాల‌ని. అందుకు గుర్తుగా జాతీయ ప‌తాకాన్ని ఇంటి మీద‌, కార్యాల‌యాల మీద ఎగుర వేయాల‌ని ఆదేశించ‌డం ఆయ‌న ప్ర‌త్యే క‌త‌. మ‌రి తాజాగా పారిశుధ్య కార్మికుల పిల్ల‌ల‌చేత రాఖీ క‌ట్టిం చుకోవ‌డం కూడా దేశ‌భ‌క్తి  అక్కాచెల్లెళ్ల  ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌మ‌న‌డం కంటే ఇంత బ్ర‌హ్మాండంగా పాలి స్తున్న బీజేపీ ని మ‌ళ్లీ గెలిపించి పుణ్యం క‌ట్టుకోవాల‌నే సందేశం దేశంలో ప్ర‌చారానికి ఇదో గొప్ప అస్త్రం. ఎందుకంటే భావీభ‌రాత పౌరులు అండ దండ‌లు మ‌రి ఎవ‌రికైనా అవ‌స‌రేమ‌గా!